Tarun- Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా పరిశ్రమలో మరో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అగ్రహీరోలందరితో సినిమాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇంతటి స్టార్ డైరెక్టర్ తన మొదటి సినిమా తరుణ్ తో చేయడం విశేషం. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారధ్యంలో స్రవంతి మూవీస్ పతాకంపై నువ్వేనువ్వే సినిమా తీశారు. ఇందులో హీరోయిన్ గా శ్రియ, ప్రకాశ్ రాజ్, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. సినిమా ఘన విజయం సాధించింది. తరుణ్ తొలి సినిమా నువ్వే కావాలి కి సైతం త్రివిక్రమ్ మాటలు రాశారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన త్రివిక్రమ్ ప్రస్తుతం అగ్రదర్శకుల్లో ఒకరుగా నిలవడం గమనార్హం.

ఇక తరుణ్ లవర్ బాయ్ గా అనేక సినిమాల్లో నటించాడు. ప్రేమ కథా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి తన ఇమేజ్ పెంచుకున్నారు. ఒకటే పద్ధతిలో ప్రేమ కథా చిత్రాలు చేయడంతో వెరైటీ లేకుండా పోవడంతో ప్రేక్షకులకు బోరు కొట్టడంతో తరుణ్ ప్రస్థానం తెరమరుగైంది. తరుణ్ కు ఎంతో ఎనర్జీ ఇచ్చిన సినిమాగా నువ్వే నువ్వే నిలిచింది. తరణ్ లోని ప్రేమను చాటిచెప్పింది. దీంతో సినిమాలో నటించిన వారందరికి మంచి పేరు రావడం తెలిసిందే. నువ్వే నువ్వే సినిమా ఇప్పటికి కూడా బోరు కొట్టకుండా ఉంటుంది.
ఇప్పటికి కూడా తరుణ్ కు ఏం పాలుపోకపోతే సెల్ లో నువ్వే నువ్వే సినిమా చూస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాలో షో వేశారు. ఈ నేపథ్యంలో తరుణ్ మాట్లాడుతున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కన్నీరు పెట్టుకున్నారు. తనకు జీవితాన్నిచ్చిన సినిమాగా నువ్వేనువ్వే నిలవడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. నువ్వే నువ్వే లాంటి సినిమా మరోటి చేయాలని ప్రేక్షకులు అడుగుతుంటారు. కానీ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తరుణ్ చెప్పడం విశేషం. నా తొలి సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఆయన తొలి సినిమాకు నేను హీరోగా నటించడం సంతోషంగా ఉందని వివరించాడు.

నువ్వే నువ్వే సినిమా అప్పట్లోనే బ్రహ్మాండమైన హిట్ సాధించింది. అటు తరుణ్ కు ఇటు త్రివిక్రమ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. వెరైటీ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా నిర్మించడంలో త్రివిక్రమ్ తీసుకున్న శ్రద్ధతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాలో కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తండ్రి, కూతురు, అల్లుడు పాత్రలకు మంచి పేరొచ్చింది. ఓ బ్యూటీఫుల్ సినిమా అని తరుణ్ ఇప్పటికి చెప్పడంతో అందరు ఎంజాయ్ చేశారు. నువ్వే నువ్వే సినిమా సినిమాతో త్రివిక్రమ్ దర్శకుడిగా నిరూపించుకున్నాడు.