Homeఎంటర్టైన్మెంట్బాలయ్య సినిమాలో మాజీ లవర్ బాయ్ ?

బాలయ్య సినిమాలో మాజీ లవర్ బాయ్ ?


బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా నుండి వచ్చిన టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మాజీ లవర్ బాయ్ కమ్ హీరో తరుణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. గతంలో బాలయ్య సినిమాలో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అన్నట్టు బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమా తరువాత బాలయ్య పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular