https://oktelugu.com/

తరుణ్ భాస్కర్ కి దశ తిరిగింది

ఒక దర్శకుడికి దశ మారాలంటే పెద్ద తారలతో సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం ఇపుడు తరుణ్ భాస్కర్ కి వచ్చింది.తొలి చిత్రం పెళ్లి చూపులు అసమాన విజయం సాధించడంతో తెలుగు చిత్ర సీమలోని పలువురు నిర్మాతల్ని ఆకర్షించిన తరుణ్ భాస్కర్ త్వరలో ఒక సీనియర్ హీరో తో సినిమా చేయబోతున్నాడు. తెలుగులో కుటుంబ కదా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచిన ఈ సీనియర్ హీరో వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు. స్క్రిప్ట్ […]

Written By: , Updated On : March 9, 2020 / 01:03 PM IST
Follow us on

ఒక దర్శకుడికి దశ మారాలంటే పెద్ద తారలతో సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం ఇపుడు తరుణ్ భాస్కర్ కి వచ్చింది.తొలి చిత్రం పెళ్లి చూపులు అసమాన విజయం సాధించడంతో తెలుగు చిత్ర సీమలోని పలువురు నిర్మాతల్ని ఆకర్షించిన తరుణ్ భాస్కర్ త్వరలో ఒక సీనియర్ హీరో తో సినిమా చేయబోతున్నాడు. తెలుగులో కుటుంబ కదా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచిన ఈ సీనియర్ హీరో వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు. స్క్రిప్ట్ విషయంలో ఎటువంటి కంప్రమైజ్ కాని ఈ సీనియర్ హీరోకి కథ చెప్పి వప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో తరుణ్ భాస్కర్ సఫలీ కృతుడయ్యాడని తెలుస్తోంది.

తన తొలి చిత్రానికి బాసటగా నిలిచి విడుదలకు సహకరించిన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కి మాట ఇచ్చిన ప్రకారం తరుణ్ భాస్కర్ రెండో చిత్రం చేయడం జరిగింది. ఈ నగరానికి ఏమైంది టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం ఆర్ధికం గొప్ప విజయం తేలేక పోయినా నష్టాలను మాత్రం తీసుకు రాలేదు. దాంతో సదరు దగ్గుబాటి సురేష్ ఇపుడు తరుణ్ భాస్కర్ కి దర్శకుడిగా మరో అవకాశం ఇవ్వబోతున్నాడు. తరుణ్ భాస్కర్ చెప్పిన కధకి హీరో వెంకటేష్ సూటబుల్ అవుతాడని సురేష్ భావించడం తో విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో నారప్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న వెంకటేష్ ఆ సినిమా పూర్తికాగానే తరుణ్ భాస్కర్ చిత్రానికి షిఫ్ట్ అవుతాడని తెలుస్తోంది. సునిశిత అంశాలతో చిత్రాన్ని నిర్మించే తరుణ్ భాస్కర్ తప్పకుండా విక్టరీ వెంకటేష్ కి విజయాన్ని అందిస్తాడని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ గట్టిగా నమ్ముతోంది.
Talent never disappoints anybody