Nandamuri Taraka Ratna: ఎన్టీఆర్ స్టార్ గా ఎదగడం నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేదా? ఎన్టీఆర్ ని తమలో ఒకడిగా వారు చూడరా? అంటే కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది. టీనేజ్ లోనే హీరోగా మారిన ఎన్టీఆర్, 20 ఏళ్ళు ఏళ్లకే స్టార్ హోదా తెచ్చుకున్నాడు. స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి చిత్రాలు ఆయన్ను మాస్ హీరోగా నిలబెట్టాయి. స్టార్ గా దూసుకుపోతున్న ఎన్టీఆర్ కొన్నాళ్ళు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్ క్యాంపైన్ చేశారు. అయినప్పటికీ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.
తర్వాత ఎన్టీఆర్, హరికృష్ణలను నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ దూరం పెట్టారు. నందమూరి ఫ్యాన్స్ లోని ఓ వర్గం ఎన్టీఆర్ సినిమాలను తొక్కేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా కెరీర్ బిగినింగ్ నుండే ఎన్టీఆర్ పై నందమూరి ఫ్యామిలీ కుట్ర పన్నిందన్న వాదన చాలా కాలంగా ఉంది. తారకరత్నను ఎన్టీఆర్ కి పోటీగానే సినిమాల్లోకి దింపారని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. 2001లో నిన్ను చూడాలని మూవీతో ఎన్టీఆర్ పరిశ్రమలో అడుగుపెట్టారు. 2002లో తారక రత్న ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.
Also Read: Yash And Prabhas: ప్రభాస్, యష్ లను కలిపిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ కు కన్నుల పండువ
సినిమా సినిమాకు ఎదుగిపోతున్న ఎన్టీఆర్ ని తొక్కేయాలంటే నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరో రావాలని తారకరత్నను వదిలారట. ఈ ఆరోపణలపై తాజా ఇంటర్వ్యూలో తారకరత్న స్పందించారు. నేను పరిశ్రమకు వచ్చేనాటికే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ కి పోటీగా నేను వచ్చాననే ఆరోపణల్లో నిజం లేదు. నాకు నటన అంటే ఇష్టం. అది గ్రహించి బాబాయ్ బాలకృష్ణ ప్రోత్సహించారు.
తమ్ముడు ఎన్టీఆర్ స్టార్ గా ఎదగడం నాకు ఎంతో సంతోషం. అతడు గొప్ప నటుడు. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం . చక్కగా జోకులు వేసుకుంటాం. మేమందరం నందమూరి వారసులమే. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని, తారక రత్న చెప్పుకొచ్చారు. అప్పట్లో తారక రత్న ఎంట్రీని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒకేసారి 9 చిత్రాలకు సైన్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. నిజంగానే ఒకటో నంబర్ కుర్రాడు చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు విడుదలయ్యాయి. మొదటి చిత్రం తప్పితే మరో మూవీ హిట్ టాక్ తెచ్చుకోలేదు. దీంతో తారక రత్న కెరీర్ పడిపోయింది.
Also Read:Pavan Kalyan And Prabhas: విచిత్రమైన సమస్య తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్