'Tandel' producer Bunny Vasu
‘Tandel’ producer Bunny Vasu : ఇండస్ట్రీ ని పైరసీ భూతం వణికిస్తుంది. గత కొంతకాలం నుండి పైరసీ నుండి విముక్తి పొంది, మంచి వసూళ్లను చూస్తున్న సినీ పరిశ్రమ, ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి మరోసారి ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు థియేటర్స్ ప్రింట్ మాత్రమే ఆన్లైన్ లో పైరసీ రూపం లో మనకు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీ లో విడుదలైనప్పుడు ఎలాంటి హై క్వాలిటీ తో సినిమా ఉంటుందో, అలాంటి క్వాలిటీ తో అందుబాటులోకి వస్తున్నాయి. ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ,’డాకు మహారాజ్’ చిత్రాలకు విడుదల రోజే HD ప్రింట్ ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు మూడు రోజుల క్రితం విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం ‘తండేల్’ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిపై నిర్మాతలు అల్లు అరవింద్ , బన్నీ వాసు చాలా తీవ్రంగా స్పందించారు.
‘పైరసీ చేసిన వారిని, పైరసీ వీడియో ని డౌన్లోడ్ చేసుకొని చూసిన వారిని వదలము, పోలీస్ కేసు వేస్తాము, అప్పట్లో ‘గీత గోవిందం’ విషయం లో కూడా ఇలాగే చేసారు. పోలీస్ కేసు వేస్తే నిన్న మొన్నటి వరకు జైలులోనే ఉన్నారు. కాబట్టి అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోకండి’ అంటూ బన్నీ వాసు హెచ్చరించాడు. ‘ఎవరికైనా పైరసీ ప్రింట్ దొరికితే వెంటనే వీడియో రికార్డు చేసి 9573225069 నెంబర్ కి పంపండి. అక్కినేని అభిమానులు దయచేసి మాకు రెండు వారాలు సహకరించింది. మేము ఎంతో కష్టపడి నాగ చైతన్య గారికి కెరీర్ బెస్ట్ సినిమాని అందించాము. ఈ సినిమా ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టే సినిమాగా నిలవబోతుంది. దానికి మీ సహకారం కావాలి, ‘తండేల్’ చిత్రాన్ని పైరసీ భూతం నుండి రక్షించండి’ అంటూ ఆయన రిక్వెస్ట్ చేసాడు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరింత వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఆర్టీసీ బస్సులో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ఏమిటండి?.ఈ పైరసీ భూతానికి మొదటి బాధితుడు మా పవన్ కళ్యాణ్ గారే. ఆయన నటించిన అత్తారింటికి దారేది చిత్రం పైరసీ జరిగినప్పుడు మేమంతా అండగా నిలబడి ఎంతో పోరాటం చేసాము. ఇప్పుడు జరుగుతున్న ఈ పైరసీ ట్రెండ్ ని కచ్చితంగా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాము. ఆ బస్సు వివరాలు మొత్తం ఈరోజు ఉదయం మాకు అందింది. ఆయన కచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది.’ అంటూ చెప్పుకొచ్చాడు. APSRTC లో ‘తండేల్’ చిత్రం ఒక్కటే కాదు, ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా ప్రదర్శితమైంది. ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు అప్పుడే ఈ విషయం పై సీరియస్ యాక్షన్ తీసుకొని ఉండుంటే, తండేల్ వరకు ఈ సమస్య కొనసాగేది కాదేమో. కానీ సినిమాకి ఎలాగో ఫ్లాప్ టాక్ వచ్చిందని ఆయన పట్టించుకోలేదు, ఇప్పుడు ఆ ట్రెండ్ కొనసాగుతూ వెళ్ళింది.
RTC bus lo #Thandel Pirated version play chesaru. We will take this issue to #PawanKalyan Garu. Ayana film #AttarintikiDaredi ki Kooda Piracy chesaru. Poradam.
— (@BheeshmaTalks) February 10, 2025