Tandel' success meet
Thadel Movie : అక్కినేని అభిమానుల్లో చాలా కాలం తర్వాత సంతోషాన్ని నింపిన చిత్రం ‘తండేల్’. గడిచిన 5 ఏళ్ళ నుండి ‘బంగార్రాజు’ సినిమా తప్ప, ప్రతీ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ‘వైల్డ్ డాగ్’, ‘ఏజెంట్’, ‘కస్టడీ’, ‘థాంక్యూ’, ‘మన్మథుడు 2’ ఇలా ప్రతీ మూవీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఇక అక్కినేని కుటుంబం లేజసీ ముగిసినట్టే, ఇక జీవితం లో హిట్ రాదేమో, నాగార్జున కూడా వరుసగా క్యారక్టర్ రోల్స్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నాడు, అఖిల్ ఈ జన్మకి హిట్ కొడతాడని నమ్మకం లేదు, నాగ చైతన్య మీద కూడా ఆశలు పోయాయి అని అభిమానులు అనుకుంటున్న సమయంలో తండేల్ చిత్రాన్ని ప్రకటించారు. అల్లు అరవింద్ లాంటి బ్రాండ్ ఇమేజ్ నుండి నిర్మాణం అవుతున్న సినిమా, కార్తికేయ సిరీస్ తో బ్లాక్ బస్టర్స్ ని అందుకొని మంచి ఊపులో ఉన్న చందు మొండేటి లాంటి డైరెక్టర్.
ఇవన్నీ పక్కన పెడితే సాయి పల్లవి హీరోయిన్, కచ్చితంగా మినిమం రేంజ్ కంటెంట్ ఉంటుంది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం అని అక్కినేని అభిమానులు ఈ సినిమాని ప్రకటించినప్పుడే బలంగా నమ్మారు. ఇప్పుడు విడుదల తర్వాత ఆ నమ్మకాన్ని మూవీ టీం నిలబెట్టుకుంది. ఊహించిన దానికంటే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి కేవలం మూడు రోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి నాగ చైతన్య కెరీర్ లో మొట్టమొదటి వంద కోట్ల గ్రాసర్ గా ఈ చిత్రం నిలవబోతుంది. నిన్న ఈ చిత్రాన్ని చూసిన నాగార్జున, ఎంతో భావోద్వేగానికి గురై ట్విట్టర్ లో నాగ చైతన్య కి, మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ట్వీట్ వేసాడు. ఆయన ట్వీట్ చూసిన తర్వాత అక్కినేని అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యాడు. సక్సెస్ మీట్ కి నాన్న డేట్స్ అడిగాను, త్వరలోనే నాన్న ముఖ్య అతిథిగా సక్సెస్ మీట్ జరగనుంది అని నాగ చైతన్య ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు.
ఆయన చెప్పినట్టుగానే రేపు ఈ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉండబోతున్నాయో వినాలని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎంతోకాలం నుండి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన విజయమిది. అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే రేంజ్ లో ఈ ఈవెంట్ ఉండబోతుంది. ఇకపోతే నేడు వర్కింగ్ డే కాబట్టి సినిమా నిలుస్తుందా లేదా?, పైరసీ జరిగింది, దాని ప్రభావం గట్టిగా ఉంటుందేమో అని మేకర్స్ భయపడ్డారు. కానీ అందరి అంచనాలకు మించి ఈరోజు వసూళ్లు ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నాల్గవ రోజున వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.