Pawan Kalyan Thammudu Movie: పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచినా ఈ చిత్రం అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Pawan Kalyan Thammudu Movie: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు ఆయనని ఒక ఆరాధ్య దైవం లాగ భావిస్తారు..కెరీర్ ప్రారంభం లోనే ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడడం వల్లే పవన్ కళ్యాణ్ కి అంత స్ట్రాంగ్ కల్ట్ ఫ్యాన్ బేస్ వచ్చింది అంటారు సినీ విశ్లేషకులు..అలా కెరీర్ తొలినాళ్ళలో పవన్ కళ్యాణ్ కి యూత్ లో తిరుగులేని ఫ్యాన్ […]

Written By: Neelambaram, Updated On : July 23, 2022 6:36 pm
Follow us on

Pawan Kalyan Thammudu Movie: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు ఆయనని ఒక ఆరాధ్య దైవం లాగ భావిస్తారు..కెరీర్ ప్రారంభం లోనే ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడడం వల్లే పవన్ కళ్యాణ్ కి అంత స్ట్రాంగ్ కల్ట్ ఫ్యాన్ బేస్ వచ్చింది అంటారు సినీ విశ్లేషకులు..అలా కెరీర్ తొలినాళ్ళలో పవన్ కళ్యాణ్ కి యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిన సినిమా ‘తమ్ముడు’ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ని ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు..అప్పటి వరుకు కేవలం నలుగురిలో ఒకరిగా కొనసాగిన పవన్ కళ్యాణ్..ఈ సినిమా తో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..కిక్ బాక్సింగ్ నేపథ్యం లో వచ్చిన మొట్టమొదటి ఇండియన్ సినిమా ఇదే..పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన మరియు ఫైట్స్ ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి.

Pawan Kalyan

పేరుకి అరుణ్ ప్రసాద్ డైరెక్టర్ అయినా, బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమాకి దర్శకత్వం మొత్తం వహించింది పవన్ కళ్యాణ్ గారేనట..’లుక్ ఎట్ మై ఫేస్ ఆన్ ది మిర్రర్’ మరియు ‘మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్’ వంటి పాటలు అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపేసాయి..ఇక ఈ సినిమా వసూళ్లు విషయానికి వస్తే అప్పట్లోనే ఈ చిత్రం 11 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది.. అంతే కాకుండా 60 కేంద్రాలకు పైగా అర్థశత దినోత్సవం ని జరుపుకున్న ఈ చిత్రం రెండు కేంద్రాలలో 175 రోజులకు పైగా ఆడింది.

Also Read: Arjun Mother Passed Away: ప్రముఖ హీరో అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం..శోకసంద్రం లో టాలీవుడ్

Pawan Kalyan

ఓపెనింగ్స్ అయితే అప్పట్లో న భూతొ న భవిష్యతి రేంజ్ లో వచ్చాయి..తొలిప్రేమ వంటి సంచలన విజయం సాధించిన సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఈ మూవీ అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఆ అంచనాలకు మించి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి..ఇదే సినిమాని తమిళ స్టార్ హీరో విజయ్ ‘బద్రి’ పేరుతో రీమేక్ చేసాడు..అక్కడ కూడా ఈ సినిమా విజయం సాధించింది కానీ తెలుగులో సాధించినంత విజయం మాత్రం సాదించలేదు అనే చెప్పాలి.

Also Read:Samantha- Naga Chaitanya: విడాకులు తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న సమంత – నాగచైతన్య
Recommended Videos


Tags