
నందమూరి బాలయ్య అభిమానులను కొట్టడం.. అది వివాదాస్పదం కావడం తరచూ జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న ఆయన.. ఈ మధ్య కూడా మరొకరిని కొట్టారు. కాగా.. ఈ విషయమై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
బాలయ్య ప్రజలను కొట్టడని, అభిమానులను మాత్రమే కొడతాడని చెప్పారు భరద్వాజ. అది కూడా తనమీద పడితేనే కొడతాడని అన్నారు. బాలయ్య కోపం తెలిసి కూడా ఎందుకు దగ్గరకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.
పులి కరుస్తుందని తెలిసి.. దాని దగ్గరికి వెళ్లి నోట్లో తల పెడితే కరవదా? అన్నారు. బాలకృష్ణ పులో, సింహమో అనేది ఇక్కడ విషయం కాదని, ఆయన కొడతాడని తెలిసినా కూడా వెళ్లి కొట్టించుకోవడం ఎందుకని అన్నారు. అందువల్ల బాలయ్య కొట్టడంలో తప్పులేదన్నారు.
బాలయ్యకు ఆవేశం వస్తే ఏదీ ఆలోచించడని, అది అమాయకత్వంతో కూడిన పిచ్చితనం అని అన్నారు. ఎవరిపైనా ఆయనకు ప్రత్యేకంగా కోపాలు ఉండవని చెప్పుకొచ్చారు. కోపం వస్తే ఏదైనా చేస్తాడని చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ.