Tamil Star Hero: మన దగ్గర కొత్త కథలు లేవన్నారు.. కట్ చేస్తే బాలయ్య కథ ను కాపీ చేసి సక్సెస్ కొట్టిన తమిళ్ స్టార్ హీరో…

అప్పట్లో బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య మాత్రం మంచి పోటీ ఉండేది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు లో డబ్బింగ్ సినిమాలు కూడా వాటి హవా ను కొనసాగించేవి.

Written By: Gopi, Updated On : March 8, 2024 5:09 pm

Tamil star hero who copied Balayya story

Follow us on

Tamil Star Hero: చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ సినిమాల మధ్య మంచి పోటీ ఉండేది. వీళ్ళ సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులను అలరించడంలో మాత్రం సక్సెస్ సాధించేవి…ఇక వీళ్ళ మధ్య సినిమాల పరంగా పోటీ ఉండేది.ఒకరు ఒక సినిమా చేశారు అంటే వాళ్లను మించిన సినిమాను మరొకరు చేసేవారు. అలాగని వీళ్ళు మధ్య శత్రుత్వాలు ఏమి ఉండేవి కాదు. ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే మళ్లీ అందరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారు.

చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలవడమే కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే దాని మీద పోరాటం చేసి ఇండస్ట్రీ ని కాపాడుకుంటూ వచ్చారు. ఏదైనా తుఫాన్ సమయంలో గానీ, ఇంకా ఏదైనా అనర్ధాలు జరిగినప్పుడు గాని అందరూ కలిసికట్టుగా ఉండి దాని మీద పోరాటం చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అప్పట్లో బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య మాత్రం మంచి పోటీ ఉండేది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు లో డబ్బింగ్ సినిమాలు కూడా వాటి హవా ను కొనసాగించేవి. ఇక డబ్బింగ్ సినిమాలకి బాలకృష్ణ సమాధానం చెబుతూ వచ్చేవాడు. ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో మన వాళ్ళు కొత్త సినిమాలు చేయలేరు అంటూ పక్క ఇండస్ట్రీ లా నుంచి ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి కొన్ని విమర్శలు అయితే వచ్చేవి.

ఇక దానికి సమాధానంగా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య ఆదిత్య 369 సినిమా చేశాడు. ఇది టైమ్ ట్రావెలింగ్ జానర్ లో వచ్చి అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన 24 సినిమా కూడా అదే జానర్ లో రావడం అలాగే టైమ్ ట్రావెలింగ్ కి సంబంధించిన సినిమా కావడం విశేషం… ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ ఆదిత్య 369 సినిమాలాగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే సేమ్ ఒకేలా ఉంటుంది. ఇక 24 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆదిత్య 369 సినిమా గుర్తుకొస్తూ ఉంటుంది. దాంతో 24 సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.

అయినప్పటికీ చాలామంది ఆదిత్య 369 స్టోరీని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా తీసి సక్సెస్ అయ్యారు అంటూ అప్పట్లో కొంతమంది కామెంట్స్ చేశారు. ఇక మరికొంతమంది మాత్రం బాలయ్య స్టోరీ తో సూర్య సూపర్ సక్సెస్ సాధించాడు అంటూ కామెంట్లు చేశారు…అయితే మనదగ్గర కొత్త కథలు రావని కామెంట్స్ చేసిన వాళ్లే మన స్టోరీ ని కాపీ చేసి హిట్ కొట్టారు అంటూ తమిళ్ ఇండస్ట్రీ మీద మనవాళ్ళు కామెంట్స్ చేశారు…