స్టార్ హీరో హెచ్చరికతో వెనక్కి తగ్గిన ఆయన తండ్రి

స్టార్ హీరో.. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్ర రాజకీయాలే మారుతాయి. కానీ ఆ హీరోకు మాత్రం రాజకీయాల్లోకి రావడం ఇప్పుడే ఇష్టం లేదు. కానీ ఆయన తండ్రి మాత్రం ఊరుకోవడం లేదు. కొడుకుకు జనాల్లో ఉన్న పేరును వాడుకొని రాజకీయంగా గట్టిగా ఎదగాలని తలంచాడు. కొడుకు వద్దంటున్నా పార్టీ పెట్టాడు. చివరకు తండ్రిపైనే కోర్టుకు ఎక్కాడు స్టార్ హీరో.. తన తండ్రి స్థాపించిన పార్టీకి తనకు సంబంధం లేదంటూ కోర్టులో కేసు వేశాడు. తమిళ స్టార్ […]

Written By: NARESH, Updated On : September 28, 2021 9:43 am
Follow us on

స్టార్ హీరో.. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్ర రాజకీయాలే మారుతాయి. కానీ ఆ హీరోకు మాత్రం రాజకీయాల్లోకి రావడం ఇప్పుడే ఇష్టం లేదు. కానీ ఆయన తండ్రి మాత్రం ఊరుకోవడం లేదు. కొడుకుకు జనాల్లో ఉన్న పేరును వాడుకొని రాజకీయంగా గట్టిగా ఎదగాలని తలంచాడు. కొడుకు వద్దంటున్నా పార్టీ పెట్టాడు. చివరకు తండ్రిపైనే కోర్టుకు ఎక్కాడు స్టార్ హీరో.. తన తండ్రి స్థాపించిన పార్టీకి తనకు సంబంధం లేదంటూ కోర్టులో కేసు వేశాడు.

తమిళ స్టార్ హీరో విజయ్ ఆ రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఉన్న నటుడు. రజినీకాంత్ తర్వాత అంతటి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రేక్షకులకు అలరిస్తున్నాడు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. ఈయన తమిళంలో అగ్ర దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తల్లి శోభ గాయని, రచయిత.

గత ఏడాది విజయ్ తండ్రి చంద్రశేఖర్ తమిళనాట ‘ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ అనే పేరు మీద రాజకీయ పార్టీని పెట్టాడు. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించారు. ఈ క్రమంలోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని అంతా అనుకున్నారు.

అయితే తండ్రి స్థాపించిన పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్ కోర్టుకెక్కాడు. తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టాడు.మొత్తం 11 మందిపై చెన్నైలోని సివిల్ కోర్టులో కేసు వేశాడు. తన తండ్రి పెట్టిన పార్టీలో తన ఫ్యాన్స్ ఎవరూ చేరవద్దని కోరాడు.

ఈ క్రమంలోనే విజయ్ తండ్రి చంద్రశేఖర్ దారికొచ్చాడు. తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన పార్టీని వెంటనే రద్దు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. దీన్ని ఫ్యాన్ అసోసియేషన్ గా కొనసాగించనున్నట్లు తెలిపారు.