https://oktelugu.com/

Devara Movie : దేవర’ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర ని మిస్ చేసుకున్న తమిళ స్టార్ హీరో అతనేనా..? చేసుంటే వేరే లెవెల్ ఉండేది!

సైఫ్ అలీ ఖాన్ పాత్ర గురించి కొరటాల శివ చాలా హోమ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. ముందుగా ఈ పాత్ర కోసం ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో చేయించాలని తెగ ప్రయత్నాలు చేసారు. కానీ విక్రమ్ ఎందుకో ఒప్పుకోలేదు. క్యారక్టర్ పవర్ ఫుల్ గానే ఉన్నప్పటికీ, విక్రమ్ కి ఎందుకో అది ఛాలెంజింగ్ గా అనిపించలేదట.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 10:11 PM IST

    Saif Ali Khan's character

    Follow us on

    Devara Movie :  టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఆడియన్స్ మొత్తం ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం. ఈ నెల 27 వ తారీఖున ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఔట్పుట్ పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కానీ ట్రైలర్ ని చూసిన తర్వాత అనిపించింది ఏమిటంటే ఎన్టీఆర్ మరో రెండు విభిన్నమైన పాత్రలతో నట విశ్వరూపం చూపించబోతున్నాడని. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ తో పాటుగా, విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా హైలైట్ అయ్యాడు.

    చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ పాత్ర గురించి కొరటాల శివ చాలా హోమ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. ముందుగా ఈ పాత్ర కోసం ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో చేయించాలని తెగ ప్రయత్నాలు చేసారు. కానీ విక్రమ్ ఎందుకో ఒప్పుకోలేదు. క్యారక్టర్ పవర్ ఫుల్ గానే ఉన్నప్పటికీ, విక్రమ్ కి ఎందుకో అది ఛాలెంజింగ్ గా అనిపించలేదట. అందుకే ఆ పాత్రలో నటించడానికి నో చెప్పాడు. ఇక ఆ తర్వాత విజయ్ సేతుపతి ని కూడా సంప్రదించారట. ఆయనకీ ఈ పాత్ర చాలా బాగా నచ్చింది, కానీ డేట్స్ సర్దుబాటు కాలేదు. ‘దేవర’ టీం ఆయన డేట్స్ కోసం ఆ తర్వాత కూడా చాలా ప్రయత్నాలు చేసారు కానీ కుదర్లేదు. చివరికి బాలీవుడ్ లో అప్పుడప్పుడే క్యారక్టర్ రోల్స్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ని ఈ పాత్ర కోసం తీసుకున్నారు. హీరోతో సరిసమానంగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా సైఫ్ అలీ ఖాన్ పాత్రని కొరటాల శివ తీర్చి దిద్దినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు.

    సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు నాడు, ఆయనకీ సంబంధించిన ప్రత్యేకమైన టీజర్ ని కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ టీజర్ లో కానీ, ఈరోజు విడుదలైన ట్రైలర్ లో కానీ, కొరటాల సైఫ్ అలీ ఖాన్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో అర్థం అవుతుంది. ఈ క్యారక్టర్ విక్రమ్ ఒప్పుకొని చేసుంటే, ‘దేవర’ రేంజ్ మరింత పెరిగేది. ముఖ్యంగా తమిళ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది, కానీ దురదృష్టం కొద్దీ ఆయన ఈ సినిమాలో నటించలేకపోయాడు. భవిష్యత్తులో అయినా విక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం మల్టీస్టార్రర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో వీళ్ళ కాంబినేషన్ సినిమా చూడొచ్చు.