Balakrishna – Boyapati : బాలయ్య – బోయపాటి సినిమాలో నటించనున్న తమిళ్ స్టార్ హీరో.. ఆయన పాత్ర ఏంటంటే..?

Balakrishna - Boyapati బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టిని ఒక క్రూరమైన విలన్ గా చూపించి అతనికి మంచి హిట్ ని అందించాడు.

Written By: NARESH, Updated On : June 18, 2024 8:43 pm

Balakrishna Boyapati Srinu

Follow us on

Balakrishna – Boyapati : తెలుగు లో బాలయ్య బాబుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు థియేటర్ ముందు పెద్ద పెద్ద కటౌట్లు కట్టి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. ఇక బాలయ్య బాబు మాస్ హీరో కాబట్టి మాస్ ఆడియన్స్ ను మెప్పించడం లో ఆయన ఎప్పుడు ముందుంటారు.

ఇక అందులో భాగంగానే ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్ లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అవడమే కాకుండా హ్యాట్రిక్ హిట్లు గా నిలవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక వీళ్ళ కాంబోలో ఇప్పుడు నాలుగో సినిమా వస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాని అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ను తీసుకునే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో బాలయ్య బాబుకి ఒక తమ్ముడు ఉంటారట.

ఇక ఆ తమ్ముడి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నారట. ఇక దానికోసం చాలా మంది ఆర్టిస్ట్ లను చూసినప్పటికి ఇప్పటివరకు ఆ క్యారెక్టర్ కి ఎవరూ సెట్ కాలేదట. ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడ వరుస సినిమాలు చేసి తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆర్య ను ప్రస్తుతం బాలయ్య బాబు తమ్ముడి క్యారెక్టర్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆర్య ఇంతకుముందు చాలా సినిమాల్లో హీరో గా నటించాడు.

అయినప్పటికీ ఆయనకు రావలసిన గుర్తింపు అయితే రాలేదు. ఇక ఇంతకు ముందు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టిని ఒక క్రూరమైన విలన్ గా చూపించి అతనికి మంచి హిట్ ని అందించాడు. ఇక ఇప్పుడు ఆర్య ను కూడా బాలయ్య బాబు తమ్ముడి పాత్రలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పాత్రకి కూడా సినిమాలో మంచి గుర్తింపు అయితే ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…