Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ని పిచ్చిగా ప్రేమిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ… ఆయన కోసమే వచ్చానంటూ ఓపెన్ కామెంట్స్!

Sudigali Sudheer : ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సర్కార్ 4 తో పాటుగా ఈటీవీలో ది ఫ్యామిలీ స్టార్స్ పేరుతో మరో షో హోస్ట్ చేస్తున్నాడు.

Written By: NARESH, Updated On : June 18, 2024 8:48 pm

Bigg Boss beauty who is madly in love with Sudigali Sudheer

Follow us on

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ 4 ఆహా లో దూసుకుపోతుంది. తాజాగా పదో ఎపిసోడ్ లో నలుగురు అందమైన అమ్మాయిలు షోలో సందడి చేశారు. ఇక సదరు బ్యూటిఫుల్ గర్ల్స్ తో సుధీర్ జోరు మామూలుగా లేదు. వరుసపెట్టి కవితలు, ప్రాసలతో అల్లాడించేశాడు. సర్కార్ సీజన్ 4 లేటెస్ట్ ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో హమీదా – సుధీర్ మధ్య లవ్ ట్రాక్ హైలెట్ అయింది.

హమీద మాటిమాటికి సుధీర్ కి హగ్స్ ఇస్తూ ప్రేమ కురిపించేసింది. సర్కార్ సీజన్ 4 పదో ఎపిసోడ్ కి హమీద, శోభా శెట్టి, యాంకర్ స్రవంతి చొక్కారపు, శుభశ్రీ గెస్టులుగా హాజరయ్యారు. ఇక ఒక్కక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ కవితలు చెప్పాడు సుధీర్. తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు. హమీద పుట్టినరోజు కావడంతో హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకంక్షలు తెలియజేశాడు. దేవకన్యలు తిరుగుతారు భూమి మీద .. దానికి సాక్ష్యమే హమీద అంటూ తెగ పొగిడేశాడు.

సుడిగాలి సుధీర్ కవితకు హమీదా ఫిదా అయిపోయింది. థాంక్యూ సుధీర్ అంటూ హగ్ ఇచ్చింది. అంతటితో ఆగలేదు సుధీర్ కోసమే షోకి వచ్చాను అన్నది. సుధీర్ ని బ్లైండ్ గా లవ్ చేస్తున్నానంటూ హమీదా మనసులోని ప్రేమ బయటపెట్టింది. హగ్గులు మీద హగ్గులు ఇస్తూ సుధీర్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. సుధీర్ – హమీద మధ్య కెమిస్ట్రీ ఎపిసోడ్ లో హైలెట్ అని చెప్పాలి . చివర్లో బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ ఒక డైలాగ్ చెప్పింది. ఎండలో తిరిగితే తగిలేది వడగాలి .. అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి అంటూ పంచ్ వేసింది.

దీంతో సెట్ మొత్తం నవ్వులతో హోరెత్తింది. మొత్తానికి ప్రోమో మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఈ ఎపిసోడ్ శుక్రవారం 8 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సర్కార్ 4 తో పాటుగా ఈటీవీలో ది ఫ్యామిలీ స్టార్స్ పేరుతో మరో షో హోస్ట్ చేస్తున్నాడు. హీరోగా మనోడి జోరు తగ్గింది. అందుకే మరలా యాంకరింగ్ పై దృష్టి సారించాడు. సుడిగాలి సుధీర్ అభిమానులు కూడా ఆయన బుల్లితెర వీడ కూడదని కోరుకుంటున్నారు.