Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులలో బాలయ్య బాబు ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లు కొట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేశాయి. ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించాయి.
ఇక ఇప్పుడు వరుసగా ఆయన చేసిన మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమాలుగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాయి.
ఇక ఇప్పుడు బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులందరికి మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు కోసం ఏకంగా తమిళ్ దర్శకులు కూడా కథలు చెప్పడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఒక ముగ్గురు స్టార్ డైరెక్టర్లు బాలయ్య బాబుకి కథలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో జైలర్ ఫేమ్ నెల్సన్ ఒక కథ చెప్పగా, యముడు ఫేమ్ హరి కూడా బాలయ్య బాబుకు కథ వినిపించారు.ఇక వీళ్ళ తోపాటుగా లింగు స్వామి కూడా బాలయ్య బాబు కి ఒక కథ చెప్పాడు.
అయితే వీళ్ళు ముగ్గురు కూడా కమర్షియల్ డైరెక్టర్లే కావడం అందుకే బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో వాళ్ళ సినిమాలో ఉంటే వాళ్ల సినిమాకి చాలా బాగా కలిసి వస్తుందనే అంశంతోనే బాలయ్య బాబు కి కథలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మూడు స్టోరీలు విన్న బాలయ్య బాబు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా చెప్పకుండా హోల్డ్ లోనే పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక బాబీ సినిమా అయిపోయిన తర్వాతే తన నెక్స్ట్ సినిమా మీద ఏది అనేది డిసైడ్ చేస్తానని బాలయ్య బాబు ఆ ముగ్గురికి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళ ముగ్గురిలో బాలయ్యా బాబు ఎవరిని డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఇదిలా ఉంటే బాలయ్య 2024 వ సంవత్సరంలో బోయపాటి తో కూడా ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే మామూలుగా ఉండదు కాబట్టి అందరికంటే ముందు బాలయ్య బాబు బోయపాటి తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాలను కూడా అందుకొని హ్యాట్రిక్ విజయాలను సంపాదించుకున్న సినిమాలు గా గుర్తింపు పొందాయి. ఇక ఇలాంటి క్రమంలో మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పెరగడం ఖాయం అని తెలుస్తుంది…