Rajamouli: పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన రాజమౌళి, తనదైన రీతిలో సినిమాలు చేయడంలో ఒక ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి. ఆయనలా సినిమాలు చేసే దమ్మున్న దర్శకుడు ఇండియా లో ఎవరూ లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు. ఒక్కసారి ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఒక దాన్ని మించి ఒకటి భారీ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమం లో ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది. ఇక మరోసారి తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సక్సెస్ చూసి ఓర్వలేని తమిళ తంబీలు మాత్రం ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కమర్షియల్ సినిమాల్లో డ్రామాని క్రియేట్ చేస్తూ సినిమాలను సక్సెస్ చేస్తున్నాడు.
కానీ ఆర్ట్ సినిమాలు తీయడం ఆయన వల్ల కాదు. ఆర్ట్ సినిమాలు తీయాలంటే దానికి చాలా టాలెంట్ ఉండాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తమిళంలో అలాంటి సినిమాలు తీయడానికి బాలా, వెట్రి మారన్ లాంటి దర్శకులు ఉన్నారు. రాజమౌళి గొప్ప దర్శకుడు కావచ్చు కానీ, మా దర్శకులతో పోల్చుకుంటే రాజమౌళి తక్కువే అంటూ తమిళులు కామెంట్లు అయితే చేస్తున్నారు.
ఇక ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా రాజమౌళిని ఎదుర్కునే దమ్ము మీకు లేక ఆర్ట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, మాస్ సినిమాలు అంటూ మాట్లాడుతున్నారు.ఏ సినిమా అయిన కూడా ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే సినిమా అయితే చాలు, అలాగే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులకు ప్రాఫిట్స్ తీసుకొచ్చే సినిమా అయితే చాలు. అది ఆర్ట్ సినిమా నా, కమర్షియల్ సినిమా నా అనేది అవసరం లేదు. ఇక మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు కూడా కమర్షియల్ సినిమా తీసి భారీ సక్సెస్ కొట్టి చూపించండి అంటూ మనవాళ్ళు కామెంట్లు చేస్తున్నారు…