https://oktelugu.com/

Tollywood: ఇండస్ట్రీ లో మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ వీళ్లేనా..?

అల్లు అరవింద్ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ప్రముఖ నటుడు అయిన అల్లు రామలింగయ్య గారి కొడుకు అయిన ఈయన ప్రొడ్యూసర్ గా మారి, పెద్ద సినిమాలను తీస్తూ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 26, 2024 / 12:35 PM IST
    Follow us on

    Tollywood: సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లు గా ఉన్న కొంతమంది ఇండస్ట్రీ లో పెద్దలుగా కూడా కొనసాగుతున్నారు. వాళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ వాళ్ళతో మాట్లాడటానికి చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్లతో ఏదైనా కొంచెం తేడాగా మాట్లాడితే వాళ్ల సినీ కెరియర్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. అయితే ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    అల్లు అరవింద్ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ప్రముఖ నటుడు అయిన అల్లు రామలింగయ్య గారి కొడుకు అయిన ఈయన ప్రొడ్యూసర్ గా మారి, పెద్ద సినిమాలను తీస్తూ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈయన చిన్న సినిమాలను తీసిన కూడా చాలా క్వాలిటీ ఉన్న సినిమాలని నిర్మిస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది బయట నుంచి ఏమైనా సినిమాలు చేసుకొని వచ్చిన కూడా ఆ సినిమాలు బాగున్నట్టయితే వాటిని కొనుగోలు చేసి రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈయన తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని చాలా మంది చెబుతూ ఉంటారని సినిమా విమర్శకులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు ఆయన టైం ని మనకి కేటాయించినప్పుడు వాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కోపమొచ్చే విధంగా మాట్లాడితే మళ్లీ ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు అనే విధంగా కొంతమంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు…

    ఇక ఆయన తర్వాత ఉన్న మరొక ప్రొడ్యూసర్ సురేష్ బాబు…డాక్టర్ డి రామానాయుడు గారి కొడుకు అలాగే విక్టరీ వెంకటేష్ వాళ్ల అన్నయ్య అయిన సురేష్ బాబు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగాడు. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలని ప్రొడ్యూస్ చేయడానికి ఆయన పెద్దగా ఇష్టపడడం లేదు కానీ, చిన్న సినిమాల్లో మంచి సినిమాలని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఈయన కూడా కొంతమంది యంగ్ డైరెక్టర్ల ని ప్రోత్సహిస్తు ఉంటారు.

    ముఖ్యంగా తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్ సురేష్ బాబు వల్లే ఇండస్ట్రీ లో ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో కొనసాగుతున్నాడని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన పెళ్లి చూపులు సినిమా సురేష్ బాబు ద్వారానే రిలీజ్ అయింది. కాబట్టి ఇలాంటి యంగ్ డైరెక్టర్లని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇండస్ట్రీలో పెద్దలు గా కొనసాగుతున్న వీళ్లతో ఎవరు కూడా గొడవలు పెట్టుకోకుండా కామ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తే వాళ్ల కెరియర్ బాగుంటుందని ఈ జనరేషన్ లో ఉన్న చాలా మందికి సినీ పెద్దలు సలహాలు ఇస్తూ ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు…