Tamil Directors: ప్రస్తుతం పాన్ ఇండియాలో సౌత్ సినిమాల హవా ఎక్కువైపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలన్నీ వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. దానికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలే ఎక్కువగా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాయి. దానివల్ల మిగతా సినిమా ఇండస్ట్రీలు కూడా 1000 కోట్లు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా 1000 కోట్లు కొడుతుంది అంటూ రిలీజ్ కి ముందే అనౌన్స్ చేస్తున్నారు. అయినప్పటికి ఆ సినిమాలేవి సూపర్ సక్సెస్ లను సాధించకపోవడమే కాకుండా భారీ నష్టాలను కూడా మిగులుస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో రీసెంట్ గా రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా సైతం 1000 కోట్లు కొడుతుంది అంటూ అనౌన్స్ చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తద్వారా ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను సాధించిన కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను అయితే అందుకోలేకపోతున్నాయి అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ప్యారడైజ్ తేడా కొడితే శ్రీకాంత్ తో చిరంజీవి సినిమా చేస్తాడా..?
మరి తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ఏమైంది ఒకప్పుడు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్లు ఇప్పుడు కేవలం 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేస్తున్నారు.
దానివల్ల వాళ్ళు చేసే సినిమా కంటెంట్ లో దమ్ము లేకుండా పోతోంది. దాంతో సగటు ప్రేక్షకుడు వాళ్ళ సినిమాలను రిజెక్ట్ చేస్తున్నాడు తప్ప సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపించలేకపోతున్నారు… ఒకప్పుడు వాళ్ళ సినిమాల్లో మంచి కంటెంట్ ఉండేది. దానివల్ల ప్రేక్షకులకు వాళ్ల సినిమాలు ఈజీగా రీచ్ అయ్యేవి… మరి ఇప్పుడు అలాంటి కంటెంట్ ని వాళ్ళు చేయలేకపోతున్నారు.
ఎంతసేపు హంగులు హార్భాటాలతో కలెక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ కథ మీద ఫోకస్ చేయడం లేదనే వార్తలైతే వినబడుతున్నాయి. పాన్ ఇండియాలో సక్సెస్ ని సాధించాలంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. మంచి కంటెంట్ ను రాసుకొని వాళ్ళు సినిమాలు చేస్తే బాగుంటుందంటూ పలువురు సినిమా విమర్శకులు సైతం వాళ్ళని విమర్శిస్తున్నారు…