Viral Photo: కొన్ని పాపులర్ చిత్రాలలో కొంతమంది నటీనటుల ముఖాలు మన బుర్రలో అలా పదిలంగా రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ వివరాలు మాత్రం తెలియవు. అయినప్పటికీ కూడా వాళ్ళను మనం మరచిపోలేము. అలాంటి నటులలో ఒకరు రాంకీ. ఈ పేరు చెప్తే ఎవరు ఈయన అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఆయన పోషించిన పాత్ర గురించి చెప్తే చాలా తేలికగా గుర్తు పట్టేస్తారు. RX 100 చిత్రం లో డాడీ పాత్రలో కనిపిస్తాడు ఈయన. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ పాత్ర జనాలకు బాగా గుర్తుండిపోయింది. ఈ చిత్రం తర్వాత కూడా రాంకీ అనేక సినిమాలు చేసాడు. మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గానే ఆయన ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో నటించాడు. ఇందులో హీరో కి సరైన సమయంలో వ్యాపార మార్గాలు చూపించి, లాభాలు పొందిన తర్వాత విదేశాల్లోకి వెళ్లి స్థిరపడిన పాత్రలో రాంకీ చాలా చక్కగా నటించాడు.
ఇదంతా పక్కన పెడితే అసలు ఎవరు ఈ రాంకీ?, ఈయన నేపథ్యం ఏమిటి?, ఇంతకు ముందు ఇంతకు ఎలాంటి సినిమాలు చేసాడు..?, ఒకప్పుడు హీరో గా కొనసాగి వయస్సు అయ్యాక ఇప్పుడు క్యారక్టర్ రోల్స్ చేస్తున్నాడా?, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. రాంకీ 1987 వ సంవత్సరంలో ‘చిన్న పూవే నల్ల పేసు’ అనే తమిళ చిత్రం ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో రాంకీ కి కోలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. 2004 వ సంవత్సరం వరకు ఆయన హీరోగానే కొనసాగాడు. ఆ తర్వాత నుండి క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. ఈయన ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కి సోదరుడు అవుతాడు. అదే విధంగా ప్రముఖ హీరోయిన్ నిరోషా ని ఈయన వివాహం చేసుకున్నాడు.
శరత్ కుమార్ కూడా విలన్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు మళ్ళీ క్యారక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కొనసాగుతున్నాడు. ఈయన మొదటి భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. శరత్ కుమార్ కి కూతురు అవుతుంది కాబట్టి, రాంకీ కి కూడా కూతురు వరుసే అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఈమె పెద్దగా సక్సెస్ లను చూడలేదు. కానీ విలన్ గా మారిన తర్వాత మాత్రం సౌత్ లోనే స్టార్ నటిగా అవతరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో మూడు సినిమాలు, తమిళం లో రెండు సినిమాలు ఉన్నాయి.
