Actress Tamannah: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి లో మంచి గుర్తింపు దక్కించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి వచ్చి 15 సమత్సరాలు గడుస్తున్నా యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూనే ఉంది తమన్నా. ఒక వైపు వెండితెరపై సత్తా చాటుతూనే… మరోవైపు బుల్లితెరపై కూడా హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇటీవల సిటీమార్, మాస్ట్రో సినిమాలలో ప్రేక్షకులను అలరించింది తమన్నా. మ్యాస్ట్రోలో మొదటి సారి విలన్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది. అయితే తాజాగా చిరంజీవి సరసన మళ్ళీ నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. చిరు – మెహర్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి ఓ అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది.

మొదటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నానే నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. అలానే ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించనున్నట్టు చిత్ర యూనిట్ అధికారిక అప్డేట్ ఇచ్చారు. గతంలో చిరంజీవి, తమన్నా కలిసి సైరా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ముహూర్తం వచ్చే 11న ఉదయం 7 గంటల 45 నిమిషాలకు చేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కీర్తీ సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తుండగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో తమన్నా అభిమానుల్లో సందడి నెలకొంది. ఇటీవల మాస్ట్రో, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులను అలరింకింది ఈ మిల్కీ బ్యూటీ.