Gangavva: గంగవ్వ యూట్యూబ్ లో బిగ్ స్టార్. ఫ్రేమ్ లో ఆమె కనబడగానే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు పాపులారిటీ అనేది ప్రముఖులకు మాత్రమే సొంతం అన్నట్టు ఉండేది. కానీ డిజిటల్ విప్లవం పుణ్యమా అని గంగవ్వ లాంటి పాత కాలపు పల్లెటూరి అవ్వ కూడా నేటి ట్రెండింగ్ పర్సన్ గా చలామణి అవుతున్నారు. దీనికి తోడు బిగ్ బాస్ లోకి వెళ్లి గంగవ్వ బాగా క్రేజ్ తెచ్చుకుంది.

అయితే, గంగవ్వ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోనే కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పైగా చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. పైగా ఈ విషయాన్ని స్వయంగా గంగవ్వనే చెప్పడంతో ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో గంగవ్వ పాత్ర పై షూట్ చేస్తున్నారు.
అన్నట్టు ఈ ‘గాడ్ ఫాదర్ ’ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గంగవ్వ చిరుకి కన్నతల్లిగా కనిపించనుంది. అనాధగా మారిన చిరుని చిన్న తనం నుంచి పెంచి పెద్ద చేసే పాత్రలోనే గంగవ్వ నటించబోతుంది. పైగా గంగవ్వ పాత్ర ఎండింగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. విలన్స్ ఆమె పాత్రను దారుణంగా చంపేస్తారని.. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఎమోషనల్ అవుతాడని తెలుస్తోంది.
Also Read: Comedian Tear Story: బాత్రూమ్స్ కడిగిన వ్యక్తి ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?
అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ కి సోదరిగా లేడి సూపర్‌స్టార్ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో యంగ్ హీరో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ ఈ సినిమా కోసం రెండు సాంగ్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉండబోతున్నాయి.
Also Read: Viswak Sen: “ఓరి దేవుడా” అంటూ వచ్చేస్తున్న విశ్వక్ సేన్…