
Tamannaah : స్లిమ్ ఫిగర్ మైంటైన్ చేయడం అంత సులభం కాదు. ఒక వయసు వచ్చాక వద్దన్నా శరీరం పెరిగిపోతుంది. ఒకప్పుడు సన్నజాజి తీగలా స్లిమ్ గా ఉండే తమన్నా షేప్ అవుట్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. థర్టీ ప్లస్ లోకి ఎంటర్ కావడంతో ఆమె శరీరం మాట వినడం లేదనుకుంటా. ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసిన తమన్నా బరువు పెరిగినట్లు క్లియర్ గా తెలుస్తుంది. గతంతో పోల్చితే తమన్నాలో ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు.
ఆ మధ్య తమన్నా కోవిడ్ బారినపడ్డారు. ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో లావయ్యారు. దాంతో తమన్నా బాడీ షేమింగ్ కి గురయ్యారు. తన శరీరం మీద వస్తున్న ట్రోల్స్ కి తమన్నా ఫైర్ అయ్యారు. ఘాటైన సమాధానం చెప్పారు. కోవిడ్ సమయంలో మానసిక ఒత్తిడి అనుభవించానన్న తమన్నా… చికిత్స కారణంగా లావయ్యాను. దాన్ని కూడా విమర్శిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఛాలెంజ్ గా తీసుకొని వ్యాయామం చేసి బరువు తగ్గారు. మరలా ఆమె లావైన సూచనలు కనిపిస్తున్నాయి.
తమన్నా మీద ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ఆమె ప్రేమిస్తున్నట్లు, రిలేషన్లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. తరచుగా కలిసి కనిపించడంతో పాటు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నట్లు సమాచారం. చాలా కాలం ఈ ఎఫైర్ వార్తలపై తమన్నా స్పందించలేదు. ఇటీవల మాత్రం ఓపెన్ అయ్యారు. అవన్నీ నిరాధార కథనాలని కొట్టిపారేశారు. దీంతో ఇన్నాళ్లు నడుస్తున్న హైడ్రామాకు తెరపడింది. విజయ్ వర్మతో తమన్నా సన్నిహితంగా ఉంటున్నారన్న మాట నిజమే అని పలువురి వాదన.
ఇక లాంగ్ కెరీర్ అనుభవించిన హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. దశాబ్దన్నర కాలంగా ఏకఛత్రాధిపత్యం చేస్తుంది. ఇప్పటికీ ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చిరంజీవికి జంటగా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేశారు. జైలర్ మూవీతో మొదటిసారి రజనీకాంత్ చిత్రంలో నటిస్తున్నారు.