Tamannaah: హాట్ బ్యూటీ ‘తమన్నా’ స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే, తమన్నా తన గురించి ఒక షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. తానూ పెద్దగా అందంగా ఉండను అని ఆమె నిత్యం ఫీల్ అవుతూ ఉంటుందట. నిజానికి తమన్నా అందహీనంగా ఉంది అని ఎవరు కామెంట్ చేయలేదు. ఏ నెటిజన్ ఆమెను ట్రోల్ చేయలేదు. కాకపోతే, తమన్నా గొప్ప అందగత్తె ఏమి కాదు.

కానీ మంచి కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తమన్నాకు ఉన్నాయి. అందుకే, ఈ బ్యూటీ తెలుగులో కొన్నాళ్ళు ఒక ఊపు ఊపేసింది. అయితే, తానూ పెద్దగా అందంగా ఉండను అని నిత్యం తనలో తానే బాధ పడుతూ ఉంటుంది కాబట్టి.. ఆ బాధను పోగొట్టుకోవడానికి, తన అందాన్ని పెంచుకోవడానికి తమన్నా అనేక కృత్రిమ మెరుగులు దిద్దుకుంది అట.
Also Read: Akhil Agent Movie: వైరల్ : సిగరెట్ కాలుస్తూ వైల్డ్ గా అఖిల్
ఏది అయితే ఏమి.. హీరోయిన్ గా తమన్నా పదమూడు ఏళ్లు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించింది. అయితే, వయసు పెరగడం, అమ్మడులో మునపటి పట్టు లేకపోవడంతో అవకాశాలు తగ్గాయి. ఈ రోజు రిలీజ్ అయిన ‘గని’ సినిమాలో కూడా ‘తమన్నా’ ఒక ఐటమ్ సాంగ్ చేసింది. మొత్తానికి కొత్త అవకాశాల కోసం తమన్నా బాగానే ఉత్సాహ పడుతుంది.
తాజాగా తమన్నా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మాట్లాడింది. ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలకు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో షో లేదా వెబ్ సిరీస్ లకు తాను నిర్మాతగా చేయాలనే ఆలోచన తనకు ఉందని తమన్నా తెలియజేసింది. అసలు తమన్నాకి ఏ స్థాయిలో ఛాన్స్ లు వస్తాయో చూడాలి.

నిజానికి టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించిన తమన్నా ఇప్పుడు తన మకాం బాలీవుడ్ కి మార్చేసింది. అక్కడే ఆమె వరుస సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకోవడానికి చూసింది. కానీ, తమన్నా హాట్ నెస్ ఆమెకు అక్కడ పెద్దగా ప్లస్ కాలేదు. కాకపోయినా హిందీలోకి వెళ్లి అక్కడ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవకాశాలు రాకపోతే.. నిర్మాతగా కూడా మారతాను అంటుంది.
Also Read:Mahesh Babu: మళ్లీ 30 మంది ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు !