Tamannaah Clashes With F3 Team: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో దశాబ్ద కాలం నుండి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి తమన్నా..అందం మరియు అభినయం రెండు ఉన్న ఏకైక హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒక్కరు..మంచు మనోజ్ హీరో గా నటించిన శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా తమన్నా ఆ తర్వాత తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి మన తెలుగు లో హ్యాపీ డేస్ సినిమా ద్వారా భారీ హిట్ కొట్టి తొలి సినిమాతోనే అందరిని ఆకర్షించింది..ఇక ఆ తర్వాత ఆమె అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్, బాలీవుడ్ మరియు కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ప్రాంతీయ బాషలలో టాప్ హీరోస్ తో నటించి అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..ఇన్ని సంవత్సరాల ఆమె సినీ కెరీర్ లో ఏనాడు కూడా ఎలాంటి గాసిప్స్ లో కానీ..కాంట్రవర్సీ లో కానీ ఇరుక్కోలేదు..కానీ గత కొద్దీ రోజుల నుండి తమన్నా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేస్తుంది.

Also Read: Bandi Sanjay: అమాయక రైతులపై అమానుష దాడులా? ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్
ఇక అసలు విషయానికి వస్తే తమన్నా హీరోయిన్ గా నటించిన F3 సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మంచి కామెడీ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో తమన్నా నటన అందరిని ఆకట్టుకుంది..ఇది కాసేపు పక్కన పెడితే ఈ మూవీ టీం తో తమన్నా గొడవలు పడింది అని గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త..దానికి కారణం ఈమె F3 ప్రొమోషన్స్ లో పెద్దగా పాల్గొనకపోవడమే..కేవలం రెండు ఈవెంట్స్ మినహా ఇప్పటి వరుకు ఈమె ఈ సినిమాకి సంబంధించి ఒక్క లైవ్ ఈవెంట్ లో కూడా పాల్గొనలేదు..కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తమన్నా పాల్గొనకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..మాములుగా తన ప్రతి సినిమా కి విడుదలకి ముందు , విడుదలకి తర్వాత ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొనే తమన్నా ఈ సినిమాకి ఎందుకు డుమ్మా కొట్టింది అనేది ఇప్పుడు సాగుతున్న చర్చ.

Also Read: Mahesh Babu- Rajamouli: రాజమౌళి మూవీ జోనర్ ఏంటి? మొదటిసారి నోరు విప్పిన మహేష్!
అయితే ఇదే విషయాన్నీ సక్సెస్ మీట్స్ లో పాల్గొంటున్న మూవీ టీం ని అడగగా ‘తమన్నా తో మాకు ఎలాంటి విభేదాలు లేవు..ఆమె వరుసగా సినిమా షూటింగ్స్ లో బిజీ గా ఉంటున్నారు..అందుకే సక్సెస్ మీట్స్ లో పాల్గొనడానికి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు..ఆమె ఈ సినిమా సక్సెస్ సాధించడం పై ఫుల్ హ్యాపీ గా ఉన్నది’ అంటూ చెప్పుకొచ్చారు..థియేటర్స్ లో సక్సెసఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా మొదటి వారం ని విజయవంతంగా పూర్తి చేసుకుంది..మొదటి వారం లో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 60 కోట్ల రూపాయలకు జరగగా, బ్రేక్ ఈవెన్ మార్కుకి మరో 10 కోట్ల రూపాయిల షేర్ వసూలు చెయ్యాల్సి ఉంది..చూడాలి మరి ఈ సినిమా ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని హిట్ స్టేటస్ కి చేరుతుందో లేదో అనేది.
Also Read: Aadhi Pinisetty: హాట్ టాపిక్ గా నటుడు ఆది వరకట్నం… అన్ని కోట్లు తీసుకున్నాడా!



[…] […]