Tamannaah Bhatia : సౌత్ లో బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా తమన్నా(Tamannaah Bhatia) పేరు ఉంటుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపుగా ఆమె రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. సుమారుగా 80 సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో ఈ రేంజ్ స్పీడ్ తో సినిమాలు చేసింది కేవలం తమన్నా మాత్రమే. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR), అల్లు అర్జున్(Icon star Allu Arjun), రామ్ చరణ్(Global Star Ram Charan), మహేష్ బాబు(Superstar Mahesh Babu), ప్రభాస్(Rebel Star Prabhas) ఇలా అందరి హీరోలతో కలిసి ఈమె సినిమాలు చేసింది. మీడియం రేంజ్ హీరోలు, కుర్ర హీరోలను కూడా వదిలిపెట్టలేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో రెండు సినిమాలు చేసింది. కేవలం నాగార్జున, బాలకృష్ణ మాత్రమే ఆమె లిస్ట్ లో మిగిలారు. వీళ్ళతో కూడా త్వరలోనే ఆమె సినిమాలు చేయొచ్చు. ఇదంతా పక్కన పెడితే తమన్నా రీసెంట్ గా ‘ఓదెల 2′(Odela 2 Movie) చిత్రం చేసింది.
Also Read : ఇళయరాజా లీగల్ నోటీసులను లెక్క చేయని ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నిర్మాత..!
ఈ సినిమా ఈ నెల 17 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటుంది. అందులో భాగంగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ రామ్ చరణ్ అభిమానుల మనసులను తీవ్రంగా నొచ్చుకునేలా చేసింది. ‘మీరు దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించేశారు. కానీ మళ్ళీ నటించాల్సి వస్తే ఏ హీరోలతో చేస్తారు?’ అని యాంకర్ ఒక ప్రశ్న అడగ్గా, దానికి తమన్నా సమాధానం చెప్తూ ‘నాకు అందరితో కలిసి మళ్ళీ నటించాలని ఉంది కానీ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లతో ఇంకోసారి చేయాలనీ బలంగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కేవలం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోల పేర్లు చెప్పనందుకు బాధపడ్డారు, కానీ రామ్ చరణ్ అభిమానులు ఇంకా ఎక్కువ బాధపడ్డారు.
కారణం రామ్ చరణ్ తో తమన్నా కి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరు కలిసి గతంలో ‘రచ్చ’ అనే సూపర్ హిట్ చిత్రం లో నటించారు. అప్పటి నుండే వీళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఇక రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ‘సైరా నరసింహా రెడ్డి’ లో కూడా తమన్నా కి ఒక పవర్ ఫుల్ పాత్ర దొరికింది. అలా వాళ్ళ మధ్య అంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ పేరు ని ఆమె ప్రస్తావించకపోవడం గమనార్హం. బాలీవుడ్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో, ఇండస్ట్రీ లో మీకు అత్యంత ఆప్త మిత్రులు ఎవరు అని అడిగితే, క్షణం కూడా ఆలోచించకుండా ఆమె రామ్ చరణ్ పేరు చెప్పింది. ఏ క్షణంలో అయినా రామ్ చరణ్ కి ఫోన్ చేసేంత చనువు నాకు ఉందని, నా వ్యక్తిగత విషయాలను కూడా అతనితో చర్చిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. అలాంటి తమన్నా నుండి ఇలాంటి షాక్ తగులుతుందని ఊహించలేదంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : రాజ్ తరుణ్ అమ్మానాన్నలను ఇంటి నుండి గెంటేసిన లావణ్య..వీడియో వైరల్
