Ilayaraja : ఇటీవలే తమిళనాడు లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న తమిళ హీరో అజిత్(Thala Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం పై మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) కేసు వేయడం సెన్సేషనల్ టాపిక్ గా మారింది. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అజిత్ పాత పాటలకు డ్యాన్స్ వేస్తూ ఫైట్ చేస్తాడు. అందులో ఇళయరాజా పాత పాట కూడా ఒకటి ఉంటుంది. తన అనుమతి లేకుండా నా పాటని ఉపయోగించారని, అందుకు నష్టపరిహారంగా 5 కోట్ల రూపాయిలు నిర్మాతలు చెల్లించాలని ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించాడు. దీనిపై అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో పెద్ద చర్చనే నడించింది. ఏమైంది ఇళయరాజాకు?, ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి ఈమధ్య? అంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియా లో తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ లీగల్ నోటీసులపై నిర్మాత రవిశంకర్ రీసెంట్ గానే స్పందించాడు.
Also Read : రాజ్ తరుణ్ అమ్మానాన్నలను ఇంటి నుండి గెంటేసిన లావణ్య..వీడియో వైరల్!
ఆయన మాట్లాడుతూ ‘ఇళయ రాజా గారు కంపోజ్ చేసిన ఆ పాటకు సంబంధించిన ఆడియో రైట్స్ ఒక ప్రముఖ సంస్థ వద్ద ఉన్నాయి. వాళ్ళ నుండి మేము ‘మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అనే సర్టిఫికెట్ ని తీసుకున్నాం. ఆ తర్వాతనే ఆ పాటని వాడుకున్నాము. అన్ని అంశాలపై మేము చట్టపరంగానే నడుచుకున్నాము. ప్రోటోకాల్ ని తూచాతప్పకుండా అనుసరించాము’ అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాత మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది, ఇళయరాజా కి లీగల్ నోటీసులు పంపే హక్కే లేదు, ఆయనకేదో డబ్బులు అవసరమై ఈమధ్య పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు అంటూ అజిత్ అభిమానులు మండిపడ్డారు. గతంలో కూడా ఇళయరాజా ఇదే విధంగా ఒక సినిమాలో తన అనుమతి లేకుండా తన పాటని వాడుకున్నారు అంటూ లీగల్ నోటీసులు పంపిన సంగతి మన అందరికీ తెలిసిందే. అప్పట్లో కూడా ఆయనపై ఇలాగే తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
ఇకపోతే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం అజిత్ కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని బయ్యర్స్ అంటున్నారు. తమిళనాడు సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ లో మాత్రం యావరేజ్ రేంజ్ వసూళ్లను మాత్రమే సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో రెండు భాషలకు కలిపి ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకంతో చెప్తున్నారు అభిమానులు. ఈ వీకెండ్ ఈ చిత్రానికి అత్యంత కీలకం, ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి. మరోపక్క వర్కింగ్ డేస్ లోనూ ఈ సినిమాకు డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
Also Read : మరోసారి వాయిదా పడిన ‘హరి హర వీరమల్లు’..కన్నీటి పర్యంతం అయిన నిర్మాత!