https://oktelugu.com/

Tamannaah: బ్లాక్ శారీ బ్యాక్ లెస్ బ్లౌజ్… మిల్కీ బ్యూటీ తమన్నాను సూపర్ హాట్ ఫోటోలు వైరల్!

జైలర్ లో తమన్నా చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఆమె నిజ జీవిత పాత్ర అయిన హీరోయిన్ గా నటించింది. జైలర్ చిత్రానికి తమన్నా చేసిన 'నువ్వు కావాలయ్యా' సాంగ్ హైలెట్ గా నిలిచింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 30, 2023 / 12:55 PM IST
    Follow us on

    Tamannaah: తమన్నా పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. సుదీర్ఘ కాలం ఆమె స్టార్డం అనుభవిస్తుంది. స్టార్ హీరోయిన్ గా తమన్నా రిటైర్ అయ్యింది. అయితే చిరంజీవి, వెంకటేష్, రజినీకాంత్ వంటి సీనియర్ హీరోలకు ఆమె ఛాయిస్ అయ్యారు. మెగాస్టార్ తో రెండు చిత్రాలు చేసింది తమన్నా. సైరా నరసింహారెడ్డిలో తమన్నా కీలక రోల్ లో మెప్పించింది. సైరా చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించింది. భోళా శంకర్ లో మరోసారి జతకట్టింది. అయితే ఈ చిత్రం నిరాశపరిచింది.

    జైలర్ లో తమన్నా చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఆమె నిజ జీవిత పాత్ర అయిన హీరోయిన్ గా నటించింది. జైలర్ చిత్రానికి తమన్నా చేసిన ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ హైలెట్ గా నిలిచింది. బోల్డ్ స్టెప్స్ తో తమన్నా మైండ్ బ్లాక్ చేసింది. జైలర్ ఏకంగా రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ మధ్య డిజిటల్ సిరీస్ల మీద ఫోకస్ పెట్టింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా సిరీస్లలో తమన్నా శృంగార సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది.

    ఇదే విషయం అడిగితే… ఈ రోజుల్లో కూడా జనాలు లిప్ లాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం వింతగా ఉంది. పాత్ర డిమాండ్ చేసినప్పుడు శృంగార సన్నివేశాల్లో నటిస్తే తప్పేముందని సమర్థించుకుంది. మరోవైపు ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ కన్ఫర్మ్ చేసింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ మధ్య ఎఫైర్ నడుస్తుందనే వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఓపెన్ అయిన తమన్నా… విజయ్ వర్మను ఇష్టపడుతున్నట్లు వెల్లడించింది.

    అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. అందుకు ఇంకా సమయం ఉందంటుంది. ఇక సోషల్ మీడియా వేదికగా తమన్నా గ్లామర్ షో చేస్తుంది. ఆమె హాట్ ఫోటో షూట్స్ కి ఇంటర్నెట్ షేక్ అవుతుంది. తాజాగా డీప్ కట్ బ్లౌజ్, బ్లాక్ శారీ ధరించి మెస్మరైజ్ చేసింది. తమన్నా సూపర్ గ్లామరస్ లుక్ వైరల్ అయ్యింది. ఆ ఫోటోలు చూస్తే తమన్నా విషయంలో ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. 30 ప్లస్ లో కూడా తమన్నా కాలేజ్ గర్ల్ గ్లామర్ మైంటైన్ చేస్తుంది.