https://oktelugu.com/

Tamannaah Bhatia: పెళ్లికి ముందే ప్రియుడితో తమన్నా అలాంటి పనులు.. యవ్వారం దుమారం, వీడియో వైరల్

ఎఫైర్ రూమర్స్ ఖండించాక కూడా ముంబైలో పలుమార్లు జంటగా కనిపించారు. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అనుకున్నారేమో కానీ... ఓపెన్ అయ్యారు. అవును విజయ్ వర్మను ప్రేమిస్తున్నాను అని చెప్పింది తమన్నా.

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2023 / 03:12 PM IST

    Tamannaah Bhatia

    Follow us on

    Tamannaah Bhatia: టాలీవుడ్ లో ఉన్నన్నాళ్లు తమన్నా భాటియాపై ఎలాంటి ఎఫైర్ రూమర్స్ లేవు. బాలీవుడ్ లో అడుగుపెట్టాక తోడును వెతుక్కుంది. నటుడు విజయ్ వర్మను ఘాడంగా ప్రేమిస్తుంది. 2023 ప్రారంభంలో వీరిపై ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు కలిసి చేసుకున్నారు. తరచుగా కలుస్తున్నారు. ఈ క్రమంలో పుకార్లు తెరపైకి వచ్చాయి. అయితే తమన్నా ఈ పుకార్లను ఖండించింది. నాకు లవర్ లేడు. నేను సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది.

    ఎఫైర్ రూమర్స్ ఖండించాక కూడా ముంబైలో పలుమార్లు జంటగా కనిపించారు. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అనుకున్నారేమో కానీ… ఓపెన్ అయ్యారు. అవును విజయ్ వర్మను ప్రేమిస్తున్నాను అని చెప్పింది తమన్నా. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో మా ప్రేమ చిగురించింది. విజయ్ వర్మ చాలా కేరింగ్. నాకు రక్షణగా ఉంటాడనే నమ్మకం కలిగింది. అందుకే ప్రేమించానని కుండబద్దలు కొట్టింది.

    ఓపెన్ అయ్యాక ఇద్దరూ విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. విరామం దొరికితే చాలు విహారాలు చేస్తున్నారు. తాజాగా మరో టూర్ కి విజయ్ వర్మ, తమన్నా వెళ్లారు. వేరు వేరు కార్లలో ముంబై ఎయిర్ పోర్ట్ కి వచ్చిన తమన్నా, విజయ్ వర్మ కలిసి నచ్చిన ప్రదేశానికి చెక్కేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ టూర్ ప్లాన్ చేశారు.

    బాలీవుడ్ లో సహజీవనం సంస్కృతి ఎక్కువైపోయింది. శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక కలిసి జీవిస్తుంది. అలియా భట్ తల్లి అయ్యాక రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. తమన్నా కూడా పెళ్లికి ముందే విజయ్ వర్మతో విహరిస్తోంది. ఇండియాలో కూడా పాశ్చత్య సంస్కృతి ఎక్కువైపోయింది. కాగా ఈ ఏడాది భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో నటించిన తమన్నా వెబ్ సిరీస్లలో నటించారు.