https://oktelugu.com/

మిల్క్ బ్యూటీ తమన్నాకి కరోనా పాజిటివ్ ?

నెలలు గడుస్తున్నా.. కరోనా వైరస్ ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. సెలబ్రెటీలను సైతం వదిలిపెట్టకుండా వర్గభేదాలను కూడా చూడకుండా కరోనా అందర్నీ కమ్మేస్తూ.. తన విశ్వరూపాన్ని చూపిస్తూ విలయతాండవం చేస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముందుగా బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంతో మొదలైన ఈ కరోనా కలకలం.. ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యను అలాగే అర్జున్ కపూర్ ను, మాజీ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరాను కూడా వదిలిపెట్టలేదు. Also […]

Written By:
  • admin
  • , Updated On : October 4, 2020 / 03:23 PM IST
    Follow us on


    నెలలు గడుస్తున్నా.. కరోనా వైరస్ ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. సెలబ్రెటీలను సైతం వదిలిపెట్టకుండా వర్గభేదాలను కూడా చూడకుండా కరోనా అందర్నీ కమ్మేస్తూ.. తన విశ్వరూపాన్ని చూపిస్తూ విలయతాండవం చేస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముందుగా బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంతో మొదలైన ఈ కరోనా కలకలం.. ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యను అలాగే అర్జున్ కపూర్ ను, మాజీ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరాను కూడా వదిలిపెట్టలేదు.

    Also Read: సామ్ తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పిన ఉపాసన

    అయితే తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియాకి కరోనా టెస్ట్ చెయ్యగా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. అయితే అందరి హీరోయిన్స్ లానే తమన్నా లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అవ్వకుండా.. యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ సంపాదనను అలాగే కంటిన్యూ చేసింది. ఇపుడు కూడా షూటింగ్స్ అన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతున్న క్రమంలో ఆ షూట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన తమన్నాకు టెస్ట్ చేయగా కోవిడ్ బయట పడింది.

    Also Read: చేతులు జోడించి వేడుకుంటున్న స్టార్ హీరో.. ఎవరికోసం?

    ప్రస్తుతం తమన్నా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఇప్పటికే తమన్నా ఇంట్లో ఉన్నప్పుడే ఆమె తల్లిందండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి అండ్ అయన ఫ్యామిలీలో అందరికీ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయి.. వారంతా ఆ మహమ్మారి బారిన నుండి త్వరగానే కోలుకున్నారు. అలాగే డైరెక్టర్ తేజ, నిర్మాత దానయ్య కూడా కరోనా నుండి పూర్తిగా బయట పడ్డారు. ఇక స్టార్ హీరో అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయి.. ఆమె కూడా కరోనాని జయించింది. ఏమైనా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది.