https://oktelugu.com/

తమన్నా చిందులతో రెచ్చిపోతుందట !

వయసు పెరుగుతున్నా తన ఫిజిక్ ను కాపాడుకుంటూ వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది తమన్నా. కుదిరితే సినిమాలు, లేదంటే ఐటమ్ సాంగ్స్ కు కూడా రెడీ అంటుంది. ఏమైనా డ్యాన్స్ మూవ్ మెంట్లలో తనకు సాటి ఎవరూ లేరనే రేంజ్ లో తమన్నా రెచ్చిపోవడం కొత్తేమి కాదు. అసలు తానూ ఒక థర్టీ ప్లస్ హీరోయిన్ అనే ఆ ఆలోచనే మేకర్స్ కు అలాగే ఆడియన్స్ కు కూడా రానీయకుండా కెరీర్ ను ఇన్నేళ్లు మెయింటైన్ చేయడం […]

Written By: , Updated On : June 12, 2021 / 05:26 PM IST
Follow us on

tamannahవయసు పెరుగుతున్నా తన ఫిజిక్ ను కాపాడుకుంటూ వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది తమన్నా. కుదిరితే సినిమాలు, లేదంటే ఐటమ్ సాంగ్స్ కు కూడా రెడీ అంటుంది. ఏమైనా డ్యాన్స్ మూవ్ మెంట్లలో తనకు సాటి ఎవరూ లేరనే రేంజ్ లో తమన్నా రెచ్చిపోవడం కొత్తేమి కాదు. అసలు తానూ ఒక థర్టీ ప్లస్ హీరోయిన్ అనే ఆ ఆలోచనే మేకర్స్ కు అలాగే ఆడియన్స్ కు కూడా రానీయకుండా కెరీర్ ను ఇన్నేళ్లు మెయింటైన్ చేయడం బహుశా ఒక్క తమన్నాకే చెల్లుబాటు అయింది అనుకుంటా.

ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ గోపీచంద్ హీరోగా చేస్తున్న సీటీమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో తమన్నా మునుపెన్నడూ లేని విధంగా ఎక్స్ పోజింగ్ విషయంలో హద్దులు మీరి పోయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో వచ్చే ”గొల్లా మల్లమ్మ కోడలా..’ అనే ఓ మాస్ పాటకు తమన్నా ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోందని, తమన్నా చిందులు కుర్రాళ్లకు నిద్రను కూడా దూరం చేస్తోందట.

పైగా తమన్నా తన చిందులకు తగినట్లుగానే విలేజ్ డాల్ గెటప్ లో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తోందట. ఇక ఈ సినిమాలో తమన్నా జ్వాలా రెడ్డి పాత్రలో నటిస్తోంది. మొత్తానికి ఈ సినిమాకి తమన్నా అందచందాలే అదనపు ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ఏమైతేనే తమన్నా వల్ల ఆ మాస్ పాట హిట్ కావడం పక్కా.

ఇక తన సినీ కెరీర్ లో గత కొన్నేళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న గోపీచంద్ కి ఈ సినిమా కీలకం కానుంది. ఈ సినిమా తరువాత తనకు నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజతో గోపీచంద్ తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. సంపత్ నంది, తేజ సినిమాలతో గోపీచంద్ ఈ సారి ఈ రేంజ్ హిట్స్ కొడతాడో చూడాలి.