https://oktelugu.com/

Tamannaah Marriage: ప్రముఖ డాక్టర్ తో తమన్నా పెళ్లి… క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

Tamannah  marriage: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటి పోయింది. ఇప్పటికీ స్టార్స్ పక్కన ఆఫర్స్ పట్టేస్తూ ఫార్మ్ కొనసాగిస్తుంది. యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, సమంత, కీర్తి సురేష్ ఇండస్ట్రీని ఊపేస్తున్నా… తమన్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తో బిజీగా గడుపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా తమన్నా ఫేడవుట్ అయినట్లే. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలు మాత్రమే ఆమెను కన్సిడర్ చేస్తున్నారు. ఇక తమన్నా ఏజ్ థర్టీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 24, 2022 / 01:15 PM IST
    Follow us on

    Tamannah  marriage: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటి పోయింది. ఇప్పటికీ స్టార్స్ పక్కన ఆఫర్స్ పట్టేస్తూ ఫార్మ్ కొనసాగిస్తుంది. యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, సమంత, కీర్తి సురేష్ ఇండస్ట్రీని ఊపేస్తున్నా… తమన్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తో బిజీగా గడుపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా తమన్నా ఫేడవుట్ అయినట్లే. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలు మాత్రమే ఆమెను కన్సిడర్ చేస్తున్నారు.

    Tamanna

    ఇక తమన్నా ఏజ్ థర్టీ ప్లస్ కాగా పెళ్లి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి తమన్నా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ, ఓ ఏడాది తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఉండకపోవచ్చు. చిరంజీవి భోళా శంకర్, వెంకటేష్ ఎఫ్ 3 చిత్రాలు తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు.అలాగే మ్యాస్ట్రో మూవీతో తమన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారారు. ఆ మూవీలో తమన్నా నెగిటివ్ రోల్ చేశారు. పరోక్షంగా తమన్నా ఇకపై తాను స్టార్ హీరోయిన్ కాదని ఒప్పుకున్నట్లే. త్వరలో కెరీర్ కి బ్రేక్ పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

    Also Read:  మూవీ టైమ్ : ‘నాని’ నుంచి గుడ్ న్యూస్.. సంపూ నుంచి ‘ధగడ్ సాంబ’ !

    ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని తమన్నా భావిస్తున్నారని కథనాలు మొదలయ్యాయి. అలాగే ఆమె వరుడిని కూడా చూసుకున్నారట. ఓ ప్రముఖ డాక్టర్ తో తమన్నాకు బంధం ముడి పడనుందని కథనాలు తెరపైకి వచ్చాయి. సదరు డాక్టర్-తమన్నా మధ్య పరస్పర అవగాహన కుదిరిందని పెళ్లి ప్రకటన త్వరలో రానుందనేది లేటెస్ట్ బజ్. దీంతో కాజల్ మాదిరి తమన్నా కూడా మ్యారీడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోనుందనే పుకార్లు చెలరేగాయి.

    Tamannaah

    పెళ్లిపై వరుస కథనాల నేపథ్యంలో తమన్నా స్పందించారు. తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చారు. తమన్నా మరో రెండేళ్ల వరకు పెళ్లి చేసుకోరట. ఆమెకు అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. నటిగా బిజీగా ఉన్న నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోలేను , పెళ్లి రెండేళ్ల తర్వాతే అంటూ స్పష్టత ఇచ్చారు. అలాగే పెళ్లి చేసుకుంటున్నానంటూ వార్తలు రాయకండి అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

    ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే భోళా శంకర్, ఎఫ్ 3 చిత్రాలతో పాటు వరుణ్ హీరోగా తెరకెక్కిన గని చిత్రంలో ఐటెం సాంగ్ చేశారు. అలాగే సత్య దేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

    Also Read: మూవీ టైమ్ : ‘నాని’ నుంచి గుడ్ న్యూస్.. సంపూ నుంచి ‘ధగడ్ సాంబ’ !

    Tags