https://oktelugu.com/

తమన్నా కెరీర్ లోనే ఇది భారీ రెమ్యున‌రేష‌న్‌ !

హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో కాస్త భారీ అంచనాలు ఉన్న సినిమా బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’. ఈ సినిమా హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్సే కీలకం. లేటు వయసులో కూడా టబు బోల్డ్ క్యారెక్టర్ లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి మెప్పించింది. అయితే తెలుగులోకి వచ్చే సరికి టబు చేసిన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. ఈ బోల్డ్ క్యారెక్టర్ […]

Written By:
  • admin
  • , Updated On : September 30, 2020 / 07:10 PM IST
    Follow us on


    హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో కాస్త భారీ అంచనాలు ఉన్న సినిమా బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’. ఈ సినిమా హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్సే కీలకం. లేటు వయసులో కూడా టబు బోల్డ్ క్యారెక్టర్ లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి మెప్పించింది. అయితే తెలుగులోకి వచ్చే సరికి టబు చేసిన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. ఈ బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి తమన్నా పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేస్తోందని.. ఎలాగూ కాస్త రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించాలి కాబట్టి ఆమె ఆడినంత నిర్మాతలు కూడా ఇస్తానన్నారట.

    Also Read: పవన్ ఫ్యాన్ ను కెలికిన దేవి నాగవల్లి.. ఏం జరిగిందంటే..?

    ఎంత కాదనుకున్నా ఇన్నాళ్లు తమన్నా భారీ సినిమాల కథానాయిక, సైరా, బాహుబలి లాంటి చిత్రాల్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడిన స్టార్ హీరోయిన్.. పైగా ప్రత్యేక గీతాల్లో నటించే కోట్లల్లో తీసుకునే తమన్నా.. ఇక సినిమా మొత్తం అంతే బోల్డ్ గా నటించాలి అంటే ఇక ఎంత తీసుకుంటుంది ? పైగా అమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. అందుకే మొదట్లో తటపటాయించిన తమన్నా చివరకు ఈ సినిమాకు సైన్ చేసింది. కాకపోతే ఈ చిత్రం కోసం తమన్నా సుమారు రెండు కోట్లు వరకు డిమాండ్ చేసిందని,, నిర్మాతలు కూడా రెండు కోట్లు ముట్టజెప్పడానికి అంగీకారం తెలిపారని తెలుస్తోంది. అయితే తమన్నా తన ఇన్నేళ్ల కెరీర్ లో ఒక సినిమా కోసం ఇంత భారీ మొత్తాన్ని తీసుకోలేదట.

    Also Read: ఆ హీరోయిన్లు వ్యభిచార దందా కూడా నడిపారా ?

    మొదటిసారి ‘అంధాదూన్’ రీమేక్ కోసమే తమన్నాకి రెండు కోట్లు ఇస్తున్నారట. మరి తమన్నా నెగెటివ్ బోల్డ్ పాత్రలో చేయనుండటం వలనే ఆమెకు ఇంత భారీ రెమ్యునిరేషన్ ఇస్తున్నారు. మరి నితిన్ – తమన్నా జోడీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు . నవంబర్ సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే హిందీలో టబు నటించిన బోల్డ్ క్యారెక్టర్ కి తమన్నా ఎంతవరకూ న్యాయం చేస్తోందో చూడాలి.