MAA members swearing: ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవం సాక్షిగా మోహన్ బాబు తీరును తలసాని సుతిమెత్తగా.. సున్నితంగా ఎండగట్టేశారు. మోహన్ బాబుకు కోపమే శత్రువు అని.. దాంతో ఆయన తీవ్రంగా నష్టపోయాడని తలసాని హితవు పలికారు. కోపం వల్లే మా ఎన్నికల్లో ఇంత రచ్చ జరిగిందన్నట్టుగా పరోక్షంగా తలసాని చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనమయ్యాయి.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓ రేంజ్ లో తలపడి విజయం సాధించాడు మంచు విష్ణు. తాజాగా ఈరోజు ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఫిలింనగర్ లోని కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన ‘మా’ ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
మోహన్ బాబు గురించి తలసాని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 25 ఏళ్ల నుంచి మోహన్ బాబుకి, తనకు మధ్య అన్నాదమ్ముల అనుబంధం ఉందని.. మోహన్ బాబుకు కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరూ చెబుతుంటారని.. కానీ నిజం చెప్పాలంటే ఆ కోపంతో ఆయన ఎంతో నష్టపోయాడని తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం ఆయన మనసుకు కూడా తెలుసన్నారు.
సమాజహితం కోసం మాట్లాడే మోహన్ బాబు వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ మాట్లాడలేదని.. మంచి వ్యక్తులను ‘మా’ సభ్యులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందసి్తున్నారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలని కేసీఆర్ సంకల్పించారు.
ఇక ఎదుటివారితో ఎలా సంస్కారంగా ఉండాలో మంచు విష్ణుకు మోహన్ బాబు నేర్పించారని..క్రమశిక్షణ అలవర్చారని తలసాని కొనియాడారు.