https://oktelugu.com/

క్యారెక్టర్ కోసం కోటి డిమాండ్ చేసిన ఆంటీ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు రాణించిన వారంతా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు కావడంతో వీరికి దర్శక, నిర్మాతలు పారితోషికం భారీగానే ఇస్తున్నారు. వీరికి క్రేజ్ బాగా ఉండటంతో తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తే హీరోయిన్లను మించిన పారితోషికం అడుగుతున్నాడటంతో నిర్మాతలు అవాక్కవుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబును ఓ క్యారెక్టర్ కోసం నిర్మాత సంప్రదించగా ఏకంగా కోటి రూపాయాలు డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాత అంత ఇచ్చుకోలేనంటూ వెనుదిరిగినట్లు సమాచారం. టాలీవుడ్లో కూలీ నెం.1 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 7, 2020 / 03:44 PM IST
    Follow us on

    ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు రాణించిన వారంతా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు కావడంతో వీరికి దర్శక, నిర్మాతలు పారితోషికం భారీగానే ఇస్తున్నారు. వీరికి క్రేజ్ బాగా ఉండటంతో తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తే హీరోయిన్లను మించిన పారితోషికం అడుగుతున్నాడటంతో నిర్మాతలు అవాక్కవుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబును ఓ క్యారెక్టర్ కోసం నిర్మాత సంప్రదించగా ఏకంగా కోటి రూపాయాలు డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాత అంత ఇచ్చుకోలేనంటూ వెనుదిరిగినట్లు సమాచారం.

    టాలీవుడ్లో కూలీ నెం.1 మూవీతో టబు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో తెలుగులో ఈ అమ్మడికి భారీ క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు అగ్రహీరోయిన స్టార్డమ్ అనుభవించిన టబు ప్రస్తుతం ఏజ్ బారవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది. క్యారెక్టర్ ఏదైనా సరే అవలీలగా టబు నటించి మెప్పించడంలో దిట్ట. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ టబు క్యారెక్టర్ ఆర్టిస్టు నటించి మెప్పించింది. దీంతో టాలీవుడ్లో టబు పేరు మళ్లీ మారుమ్రోగుతోంది.

    ‘అలవైకుంఠపురములో’ భారీ విజయం తర్వాత టబును తమ సినిమాల్లో తీసుకునేందుకు పలువురు నిర్మాతలను ఆమెను సంప్రదించారు. ఈమేరకు ఆమెకు కథలు కూడా వినిపించినట్లు సమాచారం. అయితే తనతో సినిమా చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కండిషన్‌ పెడుతుందట. ఇప్పటికే హీరో హీరోయిన్లకి కోట్ల కొద్ది రెమ్యూనేషన్ ఇస్తున్నామని ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా కోట్లు ఇవ్వాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిందేనంటూ వాపోతున్నారు. టబుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆమెకు బాగా ముట్టజెప్పినప్పటికీ కోట్లలో డిమాండ్ చేస్తుండటంతో పునరాలోచనలో పడుతున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్లో మంచి అవకాశాలు చేజారుతున్నాయి.