Namrata Shirodkar enter to Big Screen: బుల్లితెర మీద అడుగుపెట్టబోతున్న నమ్రత శిరోద్కర్..ఫాన్స్ కి ఇక పండగే!
Namrata Shirodkar enter to big screen: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతో క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని దక్కించుకున్న నమ్రత శిరోద్కర్, ఆ తర్వాత మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..మహేష్ బాబు తో పెళ్లయ్యాక ఆమె తన సినీ కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు మరియు మహేష్ బాబు ఇతర వ్యాపారాలను చూసుకుంటూ ఉండేది.ఇక […]

Namrata Shirodkar enter to big screen: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతో క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని దక్కించుకున్న నమ్రత శిరోద్కర్, ఆ తర్వాత మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..మహేష్ బాబు తో పెళ్లయ్యాక ఆమె తన సినీ కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు మరియు మహేష్ బాబు ఇతర వ్యాపారాలను చూసుకుంటూ ఉండేది.ఇక గౌతమ్ మరియు సితార పుట్టిన తర్వాత ఆమె మరింత బిజీ అయ్యింది.

Namrata Shirodkar
Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చేసిన ఓ అమ్మాయి మోసం… తల్లి బయటపెట్టిన షాకింగ్ రీజన్!
ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దైపోయారు కాబట్టి నాకు బాధ్యతలు తగ్గాయని..ఇప్పుడు ఖాళీగా ఉండడం వల్ల తెగ బోర్ కొడుతోంది అంటూ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది..అయితే నమ్రత శిరోద్కర్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి వార్తలు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..దీని పై నమ్రత గారు ఈ ఇంటర్వ్యూ లో స్పందించారు. ఆమె మాట్లాడుతూ ‘ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యం నాకు అసలు ఏ మాత్రం ఆసక్తి లేదు..కానీ బుల్లితెర మీద ఒక ప్రత్యేకమైన షో ని అతి త్వరలోనే నా ప్రొడక్షన్ హౌస్ ద్వారా నిర్మించబోతున్నాను..అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ షో నచ్చేలా ఉంటుంది.

Namrata Shirodkar
త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియచేస్తాను’ అంటూ ఆమె చెప్పడం తో మహేష్ బాబు అభిమానులు ఆ షో ఏమి అయ్యి ఉంటుంది అని ఆరాలు తియ్యడం లో బిజీ గా ఉన్నారు..ఇది ఇలా ఉండగా మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ నిర్మాణ సంస్థకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నమ్రత శిరోద్కర్ గారు దగ్గరుండి చూసుకుంటారు..ఇప్పటి వరుకు కేవలం మహేష్ బాబు సినిమాలను మాత్రమే ఈ నిర్మాణ సంస్థ లో తెరకెక్కించారు..అయితే మొట్టమొదటిసారి ఈ నిర్మాణ సంస్థ నుండి బయట వారితో ‘మేజర్’ అనే సినిమా తీసి ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుందో మన అందరికి తెలిసిందే..ఇక నుండి కూడా బయట హీరోలతో సినిమాలు నిర్మించనుంది ఈ సంస్థ.
Also Read: Kamal Hassan- Gentleman: బ్లాక్ బస్టర్ ‘జెంటిల్ మెన్’ సినిమాను కమల్ హాసన్ ఎందుకు రిజెక్ట్ చేశాడు?
