హీరోయిన్ తాప్సికి డబ్బు పిచ్చి బాగా పట్టుకుంది. నిజానికి ఈ బ్యూటీ ఇప్పుడు బాగానే సంపాదిస్తోంది, అయినా ఇంకా సంపాదించాలనేది తాప్సి ఆరాటం. అందుకే బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోవాలని గత రెండు సంవత్సరాలుగా కిందామీదా పడుతుంది. ఎందుకంటే బాలీవుడ్ లో కాస్త గుర్తింపు ఉన్న హీరోయిన్ కి కూడా పారితోషికం 4 కోట్ల వరకు ఇస్తారు.
అదే స్టార్ హీరోయిన్ రేంజ్ అయితే ఇక ఈజీగా ఏమినిది కోట్లు వసూళ్లు చేయవచ్చు. ఎలాగూ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు సరదాగా చేసుకునే అవకాశం హీరోయిన్లకు ఉంటుంది. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుంది కాబట్టే.. తాప్సి బాలీవుడ్ లో ఇంకా మంచి ఫేమ్ సాధించి.. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ ఇంకా సంపాదించాలని తాప్సి బాగా ప్లాన్ చేసుకుంటుంది.
అయితే, ఈ క్రమంలో ఎవరో పెళ్లి ఎప్పుడు అంటూ తాప్సిని ఓ చిలిపి ప్రశ్న అడిగారు. సహజంగా ఇలాంటి ప్రశ్నకు అమ్మాయిలు సిగ్గు పడుతూ లేక ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటారు. కానీ తాప్సి ఇచ్చిన సమాధానం మాత్రం భిన్నంగా ఉంది. తనకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని.. జీవితంలో బాగా డబ్బు కూడబెట్టుకున్నాకే తానూ పెళ్లి చేసుకుంటాను అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.
మరి ఈ బ్యూటీ పెళ్లి చేసుకోవాలంటే.. ఎన్ని కోట్ల బ్యాంకు బ్యాలన్స్ ఉండాలో..? అయినా హీరోయిన్లు ఎలాగూ మంచి బిజినెస్ మెన్ నే కదా పెళ్లి చేసుకునేది. వారికీ ఎలాగూ బోలెడు డబ్బు వ్యాపారాలు ఉంటాయి. అయినా తాప్సి ఇంకా సంపాదించాలని ఆశ పడుతూ ఉండటం విశేషమే. అన్నట్టు ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక ఇంటర్నేషల్ బాడ్మింటన్ ప్లేయర్ తో ఫుల్ డేటింగ్ వ్యవహారం నడుపుతుంది. మరి అతనితో తాప్సి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందా ఏమో డౌటే.