https://oktelugu.com/

Mishan Impossible Collections: `మిష‌న్ ఇంపాజిబుల్‌` క్లోజింగ్ కలెక్షన్లు.. ముంచేసిన తాప్సీ !

Mishan Impossible Collections: టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తెలుగులో చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా `మిష‌న్ ఇంపాజిబుల్‌`. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కూడా బాగా ప్రమోట్ చేశారు. కారణం.. ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి మెగాస్టార్ ఆచార్య సినిమాకు నిర్మాత కావడంతో.. ఈ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పక చిరంజీవికి తప్పలేదు. అయితే.. నా మీద నమ్మకం పెట్టుకోండి ఈ సినిమా మీకు నచ్చుతుంది అంటూ చిరు కాస్త […]

Written By: Shiva, Updated On : April 11, 2022 5:03 pm
Follow us on

Mishan Impossible Collections: టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తెలుగులో చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా `మిష‌న్ ఇంపాజిబుల్‌`. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కూడా బాగా ప్రమోట్ చేశారు. కారణం.. ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి మెగాస్టార్ ఆచార్య సినిమాకు నిర్మాత కావడంతో.. ఈ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పక చిరంజీవికి తప్పలేదు. అయితే.. నా మీద నమ్మకం పెట్టుకోండి ఈ సినిమా మీకు నచ్చుతుంది అంటూ చిరు కాస్త ఎక్కువ అభయం ఇచ్చేశారు.

Mishan Impossible Collections

Mishan Impossible Collections

కట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద బీద అరుపులతో మొత్తానికి ఫస్ట్ టు డేస్ లోనే తట్టాబుట్టా సర్ధేసుకుంది. ఏప్రిల్ 1న విడుద‌లైన ఈ సినిమా మొదటి షోతో నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుని వసూళ్ళ పరంగా మొదటి రోజే పూర్తిగా తేలిపోయింది.

ఇంతకీ ఈ సినిమా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను ఏరియాల వారీగా ఒకసారి గమనిస్తే :

నైజాం 0.29 కోట్లు

సీడెడ్ 0.16 కోట్లు

ఉత్తరాంధ్ర 0.21 కోట్లు

ఈస్ట్+వెస్ట్ 0.07 కోట్లు

కృష్ణా+గుంటూరు 0.09 కోట్లు

నెల్లూరు 0.06 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని క్లోజింగ్ కలెక్షన్లకు గానూ 0.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.07 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్లకు గానూ 0.95 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read: 152 స్క్రీన్ లలో “ఆచార్య” ట్రైలర్ రిలీజ్.. స్క్రీన్స్ లిస్ట్ ఇదే !

తాప్సీకి హిందీలో కూడా మార్కెట్ ఉంది. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటూ మీడియా ఇచ్చిన బిల్డప్ కి.. ‘మిషన్ ఇంపాజిబుల్’కి వచ్చిన కలెక్షన్స్ కు ఎక్కడా పొంతన లేదు. నిజానికి ఈ చిత్రానికి రూ.2.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కనీసం రూ.2.5 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ క్లోజింగ్ కలెక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి 0.95 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ మూవీ బయ్యర్లకి రూ.1.27 కోట్ల నష్టాల్ని మిగిల్చి డిజాస్టర్ గా మిగిలింది. మొత్తానికి నిర్మాత నిరంజన్ రెడ్డిని తాప్సీ అడ్డంగా ముంచేసింది.

Also Read: మళ్లీ అక్కడ కొట్టుడు స్టార్ట్ చేసిన ‘బాలయ్య’ !

Tags