https://oktelugu.com/

Acharya Trailer: 152 స్క్రీన్ లలో “ఆచార్య” ట్రైలర్ రిలీజ్.. స్క్రీన్స్ లిస్ట్ ఇదే !

Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ‘ఆచార్య’ ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 5:49 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ ట్రైలర్ ను 152 స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ వెల్లడిస్తూ తాజాగా పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, […]

Written By:
  • Shiva
  • , Updated On : April 11, 2022 / 04:55 PM IST
    Follow us on

    Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ‘ఆచార్య’ ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 5:49 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ ట్రైలర్ ను 152 స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ వెల్లడిస్తూ తాజాగా పోస్టర్స్ ను రిలీజ్ చేసింది.

    Acharya Trailer

    ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ లో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు మీదఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్ చాలా బాగా వచ్చా యట.

    Acharya Trailer

    ఇక దేవాలయాల పై చిరు చెప్పే డైలాగ్, అదే విధంగా చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతాయట. మొత్తానికి మెగా అభిమానులను హ్యాపీ చేయడానికి కొరటాల బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది.
    Also Read: మళ్లీ అక్కడ కొట్టుడు స్టార్ట్ చేసిన ‘బాలయ్య’ !

    అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

    ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.

    Also Read: రాజమౌళి- మహేష్ బాబు మూవీ స్టోరీ లైన్ ఇదే..!

    Tags