Dil Raju Party Rajamouli Naatu Step: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ మాత్రమే కాదు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. అసలు ఈ సినిమా రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు.

ప్రపంచ సినీ లోకాన్ని ‘ఆర్ఆర్ఆర్’ ఆ స్థాయిలో ఓ ఊపు ఊపేస్తోంది. కలెక్షన్ల విషయంలో సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించాడు జక్కన్న. ఒక సౌత్ సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.900 కోట్ల గ్రాస్ సాధిస్తోందని ఏ నిర్మాత కలలో కూడా ఊహించలేదు.
Also Read: IPL 2022: రైజర్స్ కథ మళ్లీ కంచికి.. సభ్యులు మారినా తలరాత మారలే.. టాప్ లోకి ఆ జట్టు
రేపటితో రూ.1000 కోట్ల మార్క్ ను కూడా దాటేస్తోంది. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం పండగ చేసుకుంటున్నారు. తాజాగా నిర్మాత దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా రావడం విశేషం. అలాగే రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు.
అయితే, ఈ పార్టీలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ పార్టీలో రాజమౌళి అదిరిపోయే స్టెప్ లు వేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి ‘నాటు నాటు’ సాంగ్ కి డాన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. రాజమౌళి స్టెప్స్ చూసి ఎన్టీఆర్ తో సహా అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ తెగ సంబర పడిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఐతే, లాభం లేనిది, మాట కూడా కలపని దిల్ రాజు ఇంతకీ పార్టీ ఎందుకు ఇచ్చాడు ?.. కారణం, ‘ఆర్ఆర్ఆర్’ నైజాం పంపిణీ రైట్స్ ను దిల్ రాజే కొనుక్కున్నాడు. నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ 100 కోట్ల మార్క్ దాటింది. నైజంలో ఈ స్థాయి కలెక్షన్స్ ను రాబట్టిన తొలి చిత్రంగా “ఆర్‌ఆర్‌ఆర్” సరికొత్త రికార్డును సృష్టించింది.
మొత్తానికి లాభాల ప్రళయంలో ‘దిల్ రాజు’ పై కాసుల వర్షం కురిసింది. దాంతో.. ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవడానికి దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చి అందర్నీ ఆహ్వానించాడు. ఈ పార్టీకి ఇతర హీరోలు కూడా వచ్చారు. అందరూ సక్సెస్ మూడ్ ను ఎంజాయ్ చేశారు. అయితే.. రాజమౌళి స్టెప్స్ మాత్రం ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
Also Read:AP GOVT Key decision On SPOS: స్పెషల్ పోలీసులకు ఎసరు.. మాజీ సైనికుల పోరుబాట
Ace Director @ssrajamouli fulfilled the promise he made to @Tarak9999 in @AnilRavipudi’s interview. #RRRMovie 🔥🌊🌟
Shook his leg with Director Anil Ravipudi for ‘Naatu Naatu’ step pic.twitter.com/i6kedTLIsW
— BA Raju’s Team (@baraju_SuperHit) April 4, 2022
[…] Samantha: టాలీవుడ్‌లో మిగిలిన హీరోయిన్‌లతో పోలిస్తే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగులు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా సమంత ఫుల్ బిజీగా ఉంటుంది. అందుకే సమంతకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగా ఉంటారు. […]
[…] Mahesh Babu Okkadu Sister: మహేష్ బాబు సినీ కెరీర్ లో “ఒక్కడు” సినిమా ప్రత్యేకమైనది. అప్పట్లో ఆల్ టైం రికార్డు సృష్టించిన ఈ సినిమా మహేష్ కి సోలో మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇంటిల్లిపాదినీ అలరించి పెద్ద విజయమే సాధించింది. పైగా మహిళా ప్రేక్షకులకు మహేష్ ను దగ్గర చేసింది. అయితే, ఈ సినిమాలో మహేష్ తో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో నటి కూడా ఉంది. […]
[…] OTT Releases This Week: తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఆల్ రెడీ వచ్చేశాయి. కేజీఎఫ్, ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి, […]
[…] Jagan Delhi Tour: కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత.. మంత్రి వర్గ విస్తరణకు ముందు జగన్ హస్తిన పర్యటన ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢీల్లీకి ఎందుకు పయనమయ్యారు.. మోదీ అమిత్ షాల భేటీలో కొత్త జిల్లాల గురించి మాట్లాడే అవకాశం ఉందా.. ప్రతిపక్షాన్ని బీజీపీకి దూరం చేసే ప్లాన్ ఏదైనా వేశాడా.. లేక పెండింగ్ అంశాలపై మాట్లాడతారా.. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా ఏ అంశాలపై చర్చించనున్నారు.. అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. […]
[…] Heatwaves: ఈ యేడాది ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. వృద్దులు, చిన్నపిల్లలు బయటకి కాలు పెట్టలేకపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ లో తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. […]
[…] Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో ‘శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థ’ కోసం ఒక యాడ్ చేశాడు. ఈ యాడ్ చేయడానికి చిరంజీవి అంగీకరించడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. పైగా ఈ యాడ్ లో తన లుక్ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా యాడ్ షూట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేయించారు. […]
[…] RRR 11 Days Collections: ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ప్రపంచ సినీ లోకమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులను కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ సినిమా మేకర్స్ సైతం అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏడు రోజులకు గానూ 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. 8 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 9 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 11 రోజులకు గానూ 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే, 11 రోజులకు గానూ మొత్తం ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. […]