Swara Bhasker: విభిన్న పాత్రలో నటిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్. అయితే, ఈమెకు వివాదాలు కొత్తేం కాదు. నిత్యం ఏదో ఒక అంశంపై స్పందిస్తూ.. వివాదాల్లో ఇరుక్కోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఇతరులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ట్విట్టర్లో పోస్ట్ చేయడం.. వాటిపై నెటిజన్లు ట్రోల్స్ చేయడం సర్వత్రా సాధారణంగా మారింది. కాగా, తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.
A sari, a park, a walk, a book.. ‘at peace’ must feel like this 💛✨#smalljoys #gratitude #feelingwise 🙂 pic.twitter.com/QREYOLYnyO
— Swara Bhasker (@ReallySwara) November 9, 2021
ఇటీవల స్వరా భాస్కర్ ఓ మైక్రో బ్లాగింగ్ను మొదలుపెట్టింది. అందులో తొలిసారి ఆమె చీరలో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.అయితే, ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. నీ కన్నా మా పనిమనిషి చీరలో ఇంకా అందంగా ఉంటుందని కామెంట్ల వర్షం కురిపించారు.
దీనిపై స్పందించిన స్వరా.. అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది. నా కన్నా మీ పనిమనిషి చీరలో బావుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఆమె చేసే పనికి మీరు గౌరవం ఇవ్వాలని ఆశిస్తున్నా. ఆమెను ఎప్పుడూ కూడా ఆసభ్యంగా, చులకనగా చేసి మాట్లాడకుండా.. మర్యాదగా వ్యవహరించాలని కోరుకుంటున్నా.. అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనిపై నెట్టింట చర్చ నడుస్తోంది. మరోవైపు తనపై వచ్చిన కామెంట్లకు బాగా సమాధానం చెప్పారంటూ.. కొంతమంది స్వరాను ప్రశంసిస్తున్నారు.