
Swara Bhaskar : సోషల్ మీడియా యుగంలో దాపరికం అంటూ లేకుండా పోయింది. అసలు ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదో, అనే సెన్స్ కూడా ఉండటం లేదు. లైక్స్, షేర్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. బెడ్ రూమ్, బాత్ రూమ్ ఫోటోలు కూడా పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో పెట్టేస్తున్నారు. జనాలకు ఇదో సైకలాజికల్ డిజార్డర్ గా తయారైంది. సెలెబ్రిటీలు, సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తాజాగా ఓ నటి ఏకంగా తన శోభనం గది ఫోటో షేర్ చేసింది. గులాబీలు, మల్లెలతో అలంకరించిన బెడ్ ని ఫోటో తీసి సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు. అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ స్వర భాస్కర్ ఇటీవల వివాహం చేసుకున్నారు. సోషల్ యాక్టివిస్ట్, సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ ని పెళ్లి చేసుకున్నారు. రహస్యంగా వివాహం చేసుకున్న ఈ జంట కొద్దిరోజుల తర్వాత మేము పెళ్లి చేసుకున్నామని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. స్వర భాస్కర్ సైతం సమాజ్ వాదీ పార్టీలో చేరడం జరిగింది. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఫహద్ తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీయడంతో పెళ్లి చేసుకున్నారు.
కాగా ఫహద్ తో ఫస్ట్ నైట్ కోసం స్వర భాస్కర్ తల్లి శోభనం గది సిద్ధం చేశారట. ఆమె మంచాన్ని పూలతో అలంకరించారట. నా శోభనం గదిని, మంచాన్ని మా అమ్మగారు ఇలా అందంగా అలంకరించారంటూ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆమెను జనాలు ట్రోల్ చేస్తున్నారు. శోభనం గది, మంచం గురించి కూడా జనాలకు చెప్పాలా, అని మండిపడుతున్నారు.
అసలు ఫహద్ ని వివాహం చేసుకోవడమే పెద్ద వివాదమైంది. గతంలో ఆమె ఫహద్ ని అన్నయ్య అని పిలిచేవారట. అన్న అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకున్నావంటూ స్వర భాస్కర్ ని నెటిజెన్స్ ఏకిపారేశారు. అలాగే ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని కొందరు ఖండించారు. ఇక కెరీర్లో సైతం స్వర భాస్కర్ అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. వీరిది వెడ్డింగ్ మూవీలో స్వర బోల్డ్ సీన్స్ లో నటించారు. అప్పట్లో స్వర భాస్కర్ వ్యవహారంపై పెద్ద దుమారం రేగింది. గత ఏడాది స్వర నటించిన జాన్ చార్ యార్ మూవీ విడుదలైంది. ప్రస్తుతం ఆమె మిసెస్ పళని చిత్రం చేస్తున్నారు.