బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగింది. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పిల్లలు పేపర్ చూసి నిజం తెలుసుకొని తన తండ్రిని అసహ్యించుకుంటూ తన తండ్రికి దూరమవుతారు.ఇదే విషయాన్ని కార్తిక్ దీపకు చెప్పి బాధపడగా దీప పిల్లలు పేపర్ చూసినట్టు ఉన్నారని మనసులో అనుకుంటుంది. ఇకపోతే సౌందర్య స్వప్న పిల్లలను తీసుకొని తన ఇంటికి వెళ్లగా ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఏంటే మాట్లాడవ్ ఏమిటి అని సౌందర్య అనగా మాట్లాడడానికి మన మధ్య మాటలు ఏముంటాయి. నువ్వు నా మనసుకు చేసిన గాయం ఇంకా మర్చిపోలేదు అమ్మా అంటూ స్వప్న మాట్లాడుతుంది. నేను ఇప్పుడు మారిపోయానే అని సౌందర్య అనగా నేను మారలేదు అంటూ స్వప్న బదులిస్తుంది.

నాపై ప్రేమ లేదని సౌందర్య అనడంతో ప్రేమల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఉన్న వాళ్ళయినా లేని వాళ్ళయినా ఆడపిల్లకు ఎంతో గౌరవం చూసుకుంటారు కానీ నా అదృష్టం ఏమిటో ఇలా ఉందని స్వప్న బాధపడుతుంది.నా కూతురు కేవలం నల్లగా పుట్టిందని నన్ను ఎంతో అవమానించావు ఇప్పుడు కార్తీక్ పిల్లలు కూడా నల్లగా ఉన్నారు వారిని దగ్గరకు తీసుకున్నాను అంటూ స్వప్న నిలదీస్తుంది. గతంలో జరిగిన సన్నివేశాలను గుర్తుచేసుకుంటూ తన తల్లిని ప్రశ్నించగా ఇప్పుడేంటి మంకుపట్టు పడతావా అంటూ సౌందర్య అనగా ఇంటికి రాగానే మొహం మీద తలుపు వేయలేదు పరాయివ్యక్తికి ఇచ్చినట్టు కాఫీ ఇచ్చాను తాగి ఇక్కడినుంచి వెళ్ళు అని చెబుతోంది.
సౌందర్య మాట్లాడుతూ నా మనవరాలు ఏది అని అడగగా.. అది ఇక్కడకు రానంది అక్కడే చదువుకుంటానని చెప్పింది అంటూ స్వప్న కోపంగా చెబుతుంది. అంత చదువుకున్నావు ఆడపిల్ల కంటే నీకు నీ కొడుకే ముఖ్యం అయ్యాడు కానీ ఇప్పుడు ఏమైంది నువ్వు నాకు చేసిన అవమానానికి ఆ దేవుడు తగిన శిక్ష విధి స్తున్నాడు. నా కొడుకు అందగాడు నా కూతురు అనాకారి అన్నావు ఇప్పుడు ఏమైందమ్మా మరి నీ అందమైన పుత్రుడు చేసిన పనికి ఊరంతా కథలు కథలుగా చెప్పుకున్నారు అంటూ కార్తీక్ విషయాన్ని తన తల్లి దగ్గర చెబుతుంది. నిజంగా నా పుత్రుడు ఏ తప్పు చేయలేదు అంటూ సౌందర్య కార్తీక్ తప్పులేదు అని చెబుతుంది.ఇలా వీరిద్దరి మధ్య మాటలు కొనసాగుతూ ఇక బయలుదేరదామని ఆనందరావు చెప్పగా ఇకపై ఎప్పుడు ఇక్కడికి రాకండి నేను నీ కూతురు అని కూడా ఎవరికీ చెప్పకండి అంటూ స్వప్న అనడంతో సౌందర్య కార్తీక్ బాధగా వెను తిరుగుతారు.
ఇక కార్తీక్ పిల్లలు తన నుంచి దూరం వెళ్ళి పోవడం గురించి ఆలోచిస్తూ ఉండగా సౌందర్య ఆనందరావు దీప ఎక్కడ అడగగా ఈ వంటలక్క ఏ పాత్రలు కొనడానికి వెళ్ళిందో అంటూ కార్తీక్ నవ్వుతాడు. కట్ చేస్తే దీప మోనితను కలవడానికి జైలుకు వెళుతుంది.అంతలోనే సుకన్య అక్కడికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పడంతో ఏ రత్న సీత వచ్చి ఉంటుందని మోనిత బయటకు వస్తుంది. దీపని చూసిన మోనిత షాక్ అవుతూ.. అరెరే దీపక్క నువ్వు వచ్చావా? ఎవరో వచ్చారు అనుకున్నానే నా కోసం ఏం తెచ్చావు పుల్లటి మామిడి పండ్లు తెచ్చావా అంటూ అని అడగగా తన చేతిలో ఉన్న కవర్ తనకి ఇస్తుంది. ఇంతకీ మన కార్తీక్ ఎలా ఉన్నాడు. మనం సొంత అక్క చెల్లెలు కాక పోయినా కార్తీక్ మనల్ని అక్క చెల్లెల్ని చేశాడుఅంటూ కార్తీక్ గురించి మాట్లాడుతుండగా దీప కోపంతో ఊగి పోతుంది. ఈ క్రమంలోనే దీప పేపర్ ప్రకటన గురించి మోనిత నిలదీస్తుంది.ఆ విషయం పక్కదారి పట్టింది ఇంకేంటి సంగతులు అని అడగడంతో దీప నేను నీ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి రాలేదు పేపర్లు రాసిన రాతలు మానేయ్ అని చెప్పడానికి వచ్చాను అంటూ తనని హెచ్చరించడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.