Homeఎంటర్టైన్మెంట్Sushmita Sen: సుస్మితా సేన్.. ఆమె ఏ బంధంలోనూ ఇమడదు

Sushmita Sen: సుస్మితా సేన్.. ఆమె ఏ బంధంలోనూ ఇమడదు

Sushmita Sen: ఆమె అంతే.. మారదు అంతే. ఏ బంధంలోనూ ఇమడదు. ఏ అనుబంధమూ ఆమెను కట్టిపడేయదు. బందిఖానాలో ఉండే వ్యక్తిత్వానికంటే స్వేచ్ఛగా జీవించడాన్నే ఆమె ఇష్టపడుతుంది. ఇప్పటికీ ప్లస్ మైనస్ లు లెక్కల్లో ప్లస్ కే ఎక్కువ వాల్యూ ఇచ్చే ఈ సొసైటీ అంటే ఆమెకు నచ్చదు. అందుకే ఆమె జీవితంలోకి ఎన్నో ప్లస్ లు వచ్చినా తన మైనస్ కు మ్యాచ్ కాలేదు. ఉన్నన్ని రోజులు ఉంది. తర్వాత కటీఫ్ చెప్పేసింది. 46 ఏళ్ల సుస్మిత సేన్ ఏం చేసినా సంచలనమే. ఇంకో నాలుగేళ్లు గడిస్తే ఆరు పదుల్లోకి వెళ్లే లలిత్ మోడీతో ఆమె డేటింగ్ అంటే ఎవరు పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే సుస్మితాసేన్ దేనికీ లొంగదు. ఏదయినా కొన్నాళ్ళే. అది బంధమైనా, మనుషులైనా..

Sushmita Sen
Sushmita Sen

ఆమె నేపథ్యమే ఇంట్రస్టింగ్

సుస్మితా సేన్ ది బెంగాలీ నేపథ్యం. హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. తండ్రి షబ్బీర్ సైన్ నేవీలో వింగ్ కమాండర్. తల్లి సుబ్రాసేన్ జ్యువెలర్ డిజైనర్. 17_ 18 ఏళ్ల వయసున్నప్పుడే మిస్ ఫెమీనా కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె కళ్ళు మిస్ యూనివర్స్ పై పడ్డాయి. కష్టపడింది కిరీటాన్ని దక్కించుకుంది. ఈమె, ఐశ్వర్యరాయ్ ఒకే ఏడాదిలో ఒకరు మిస్ వరల్డ్ ఇంకొకరు మిస్ యూనివర్స్ కిరీటాలు గెలుచుకున్నారు. అప్పట్లో ఐశ్వర్యరాయ్ కి మంచి సినిమాలు పడ్డాయి. దక్షిణాదిలోనూ ఒక ఊపు ఊపింది. కానీ సుస్మిత ఏదీ సరిగా ప్లాన్ చేసుకోలేదు. కొన్నాళ్లు కెరీర్ బాగానే గడిచినప్పటికీ.. తర్వాత సినిమాలు లేకపోవడంతో అతిధి పాత్రలకే పరిమితమైంది. కొన్నాళ్లకు అసలు తెరపైన కనిపించడమే మానేసింది. మొన్న అంటే 2020లో డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అయ్యే ఆర్య వెబ్ సిరీస్ లో నటించింది. ఆమె వ్యక్తిత్వం, కెరీర్ మాత్రమే కాదు ఆరోగ్యం కూడా పూర్తి భిన్నమే. ఆమె అరుదైన జన్యు సంబంధమైన ఆడిషన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నది. దీనికోసం జీవితాంతం స్టెరాయిడ్స్ వాడకం తప్పనిసరి. పైగా ఆ మధ్య ఏదో సర్జరీ చేసుకుందని వార్తలు వచ్చాయి. దేనికోసమో చెప్పలేదు. పైగా ఈ మధ్య జిమ్ లో కసరత్తులు చేస్తూ పాత జీవితంలోకి వచ్చానంటూ పోస్టులు పెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇద్దరు అనాధ పిల్లల్ని పెంచుకుంటూ, వారిని చదివించుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

Also Read: Huma Qureshi: అప్పటి ముచ్చట్లు : ఆ నిర్మాత బట్టలు తీయమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఎన్నో అనుబంధాలు

వాస్తవానికి లలిత్ మోడీతో సుస్మితకు అనుబంధం అనేది బిగినింగ్ కాదు. అది రీ బినిగినింగ్. గతంలోనే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది. ఇద్దరు సన్నిహితంగా ఉన్న బొచ్చెడు ఫోటోలు మీడియా సర్కిళ్ళల్లో తిరిగాయి. వాస్తవానికి సుస్మిత ఏ బంధంలోనూ ఈ మడలేదు. ఆమె ఇమిడే రకం కూడా కాదు. మొదట దర్శకుడు విక్రమ్ భట్ తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. అప్పటికే విక్రమ్ కు ఆదితి తో పెళ్లయింది. వారిద్దరి వ్యవహారం ఇంటిదాకా వచ్చింది. నానా గొడవలు జరిగాయి. తర్వాత కొన్నాళ్లకి విక్రం కి సుస్మిత కటిఫ్ చెప్పేసింది. రణదీప్ హుడా తో కలిసి తిరిగింది. ఆఫ్ కోర్స్ అతడూ అలాంటి వాడే. ఏ పార్టీలో చూసినా వీరే కనిపించే వారు. పత్రికల్లోనూ పతాక శీర్షికలు అయ్యే వారు. సినిమా పరిశ్రమలో బంధాల్ని ఎవరూ తప్పు పట్టరు. తప్పు అనేవాళ్లు ఎక్కువకాలం ఈ ఫీల్డ్ లో ఉండరు. తర్వాత ఈ బంధం కూడా బెడిసి కొట్టింది. కొన్నాళ్లకు కార్నర్ స్టోన్ అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓనర్ బంటి సచ్ దేవ్ తో వ్యవహారం నడిపింది. అది కూడా కొన్నాళ్లకే ముగిసింది. ప్రస్తుతం అతడు సోనాక్షి సిన్హా తో డేటింగ్ లో ఉన్నాడు. “ఏక్ కిలాడీ ఏక్ హసినా” అనే రియాలిటీ షో కు పాకిస్తాన్ క్రికెటర్ వసీమ్ అక్రం, సుస్మితసేన్ జడ్జిలుగా ఉండేవారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత ఐదారునెలలకే ఆ బంధం బెడిసి కొట్టిందని మీడియా రాసింది. అందుకు కారణం లలిత్ మోదీ తో సుస్మిత ఆటాచ్ అయిందని, ఇద్దరి మధ్య దూరపు బంధుత్వం ఉందని మీడియా కోడయి కూసింది.

Sushmita Sen
Sushmita Sen

కానీ బెంగాలీ వైద్య కుటుంబానికి, లలిత మోడీ పాటియాలా వర్గానికి లంకె కుదరదు. ముంబైలో స్థిరపడిన హోటళ్ల వ్యాపారి రితిక్ బాసిన్ తో సుస్మిత కొన్నాళ్లు వ్యవహారం నడిపింది. దీనికి ముందు ఫిల్మ్ మేకర్ ముదసర్ అజీజ్ తో డేటింగ్ చేసింది. అది ఆయన కుటుంబంలో గొడవలకి దారి తీసింది. తీరా ఆ బంధానికి కూడా బీటలు వారాయి.తనకి 36 ఏళ్లు ఉన్నప్పుడు 22 ఏళ్ల ఇంతియాజ్ ఖత్రి తో సాన్నిహిత్యం, ఆ తర్వాత హాట్ మెయిల్ ఫౌండర్ సమీర్ భాటియా తో వ్యవహారాలు నడిపింది. ఇన్ని బంధాల తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్ తో చేసిన సహజీవనం. నాలుగేళ్ల పాటు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ మధ్య సుస్మిత గర్భవతి అని వార్తలు వచ్చాయి. అవన్నీ గాలి కబుర్లు అని తేలి పోయాయి. నాలుగేళ్ల తర్వాత రోహ్మాన్, సుస్మిత కటీఫ్ చెప్పుకున్నారు. ఈ మీడియాకు పెద్ద ఆశ్చర్యమైన విషయం అనిపించలేదు. సుస్మిత ఆన్నేళ్లు ఒక వ్యక్తితో ఉండటమే గొప్ప. ఆమె జీవితం ఆమె ఇష్టం. కానీ ఇంత వైరుధ్యమైన పయనంలోనూ ఆమె ఎవరినీ మోసం చేయలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎదుటి వ్యక్తికి నచ్చితేనే డేటింగ్ చేసేది. ఉన్నన్నాళ్ళు బాగానే ఉండేది. నచ్చని పక్షంలో కఠిఫ్ చెప్పేది. కానీ అత్యంత వివాదాస్పద క్రికెట్ వ్యాపారి, లండన్ పారిపోయి అక్కడ జీవిస్తున్న లలిత్ మోడీ.. సుస్మిత నేను డేటింగ్ లో మాత్రమే ఉన్నాము. ఇంకా పెళ్లి చేసుకోలేదు అని ట్వీట్ చేయడమే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నది సుస్మితాసేన్. ఈ బంధంలోని ఇమడని పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్.

Also Read:Vishwak Sen: కుర్ర హీరోతో ముదురు హీరోయిన్ ఫిక్స్.. కొత్త రకం ప్రేమ

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular