Ram Charan Sushmita: మెగా పవర్ స్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు రామ్ చరణ్… ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న పెద్ది సినిమా మీద ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.ఇక ఆ ఆశలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ని కోరుకుంటున్నారో ఆ సన్నివేశాలన్నీ ఇందులో మిళితం చేసినట్టుగా తెలుస్తుంది… ఇక రామ్ చరణ్ వాళ్ళ అక్క అయిన సుశ్మిత కొణిదల రీసెంట్ గా చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ ‘ సినిమా చేసి సూపర్ సక్సెస్ ను సాధించింది.
ఈ సినిమాతో దక్కిన సక్సెస్ ను వాడుకుంటూ ఆమె రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటుందట. ముఖ్యంగా రామ్ చరణ్ తో కౌబాయ్ జానర్ లో సినిమాను చేస్తే అద్భుతంగా ఉంటుందని భావిస్తుందట. ఒకప్పుడు వాళ్ళ నాన్న అయిన చిరంజీవి చేసిన కొదమసింహం, కొండవీటి దొంగ లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఈ సినిమాల్లో చిరంజీవి కౌబాయ్ గా నటించి మెప్పించాడు.
మరి అదే తరహాలో రామ్ చరణ్ తో అలాంటి ఒక సినిమాని ప్లాన్ చేయాలని సుష్మిత చూస్తున్నారు… మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే వీలైనంత తొందరగా వీళ్ళ కాంబినేషన్ పట్టలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…
ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా చిరంజీవి ఈ ఏజ్ లో గొప్ప విజయాన్ని సాధించి మన శంకర్ వర ప్రసాద్ సినిమాతో మరోసారి మెగాస్టార్ ఇస్ బ్యాక్ అనేలా ప్రశంసలను అందుకున్నాడు. మరి ఆ ఘనత సాధించడంలో సుస్మిత కొణిదల కూడా కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. మొత్తానికైతే చిరంజీవికి సరిపోయే కథతో తను ప్రొడ్యూసర్ గా వ్యవహరించి ఒక సక్సెస్ఫుల్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక తన హార్డ్ వర్క్ కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు…