
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం మృతి చెందడంతో చిత్రసీమలో విషాదచాయలు నెలకొన్నాయి. సుశాంత్ సింగ్ మృతిపై అనేక అనుమానాలు నెలకొనడంతో ఆయన మృతి మిస్టరీగా మారింది. ఓవైపు సుశాంగ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా మరోవైపు అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతి నుంచి కుటుంబ సభ్యులు కోలుకోక ముందే ఆ ఇంట్లో మరోవిషాదం నెలకొనడం అందరినీ కలిచివేస్తోంది.
సుశాంత్ సింగ్ మృతి వార్త తెల్సినప్పటి నుంచి అతడి వదిన(కజిన్ బ్రదర్ భార్య) తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆదివారం నుంచి ఆమె అన్నపానీయాలు తీసుకోకుండా నీరసించి పోయింది. సోమవారం సాయంత్రం ముంబైలో సుశాంత్ సింగ్ అంత్యక్రియలను నిర్వహిస్తున్న క్రమంలో మరో మరణం చోటుచేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారమే సుశాంత్ సింగ్ వదిన బీహార్లోని పూర్ణియాలో మృతిచెందటంతో కుటుంబ సభ్యులు దుఖసాగరంలో మునిగిపోయారు.
మరోవైపు సుశాంత్ సింగ్ మృతిపై ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన బలవర్మణానికి దారితీసిన కారణాలను ఛేదించే పనిలో పడ్డారు. సుశాంత్ చివరిసారిగా ఎవరితో మాట్లాడారు? తదితర విషయాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రెటీలు సుశాంత్ కుటుంబానికి ధైర్యం చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. సుశాంత్ మృతి మిస్టరీని పోలీసులు త్వరగా తేల్చాలని ఆయన అభిమానులు, సన్నిహితులు కోరుతున్నారు.