https://oktelugu.com/

ఓటీటీలో ‘నవరసాలు’ పండించనున్న సూర్య

కరోనా మహమ్మారి మనుషుల జీవన విధాలనాలను సమూలంగా మార్చేసింది. ఇప్పుడు మన అలవాట్లు మారిపోయాయి. ‘కలిసి’ బతకలేకపోతున్నాం. కలివిడిగా ఉండలేకపోతున్నాం. ప్రపంచానికి పెను సవాల్‌ విరుసుతున్న ఈ ప్రాణాంతక వైరస్‌ అనేక రంగాలను కుదిపేసింది. అందులో ప్రధానమైనది సినిమా ఇండస్ట్రీ. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్లకే బ్రేక్ పడగా.. థియేటర్లకు తాళాలు పడ్డాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను కూడా బిగ్‌ స్క్రీన్‌పై ప్రదర్శించే చాన్స్‌ లేకుండా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 15, 2020 / 09:14 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి మనుషుల జీవన విధాలనాలను సమూలంగా మార్చేసింది. ఇప్పుడు మన అలవాట్లు మారిపోయాయి. ‘కలిసి’ బతకలేకపోతున్నాం. కలివిడిగా ఉండలేకపోతున్నాం. ప్రపంచానికి పెను సవాల్‌ విరుసుతున్న ఈ ప్రాణాంతక వైరస్‌ అనేక రంగాలను కుదిపేసింది. అందులో ప్రధానమైనది సినిమా ఇండస్ట్రీ. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్లకే బ్రేక్ పడగా.. థియేటర్లకు తాళాలు పడ్డాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను కూడా బిగ్‌ స్క్రీన్‌పై ప్రదర్శించే చాన్స్‌ లేకుండా పోయింది. అయితే, చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీల బాట పడుతున్నాయి. బాలీవుడ్‌లో పెద్ద సినిమాలు సైతం ఓటీటీల్లో రిలీజవుతుండగా.. సౌత్‌ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు తమ ఆలోచనలు మార్చుకుంటున్నాయి.

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సెన్సేషనల్ అప్‌డేట్..

    భవిష్యత్తు డిజిటల్‌ మీడియాదే అనే వాస్తవాన్ని గ్రహిస్తూ.. ఇప్పుడిప్పుడే ఓటీటీల బాట పడుతున్నారు. వాళ్లే కాదు స్టార్లు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికే సమంత, నిత్యా మీనన్, ప్రియమణి తదితరులు హిందీ వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. దర్శకుడు క్రిష్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ కోసం పని చేస్తున్నారు. నవదీప్‌, ప్రియదర్శి, సందీప్‌ కిషన్‌, సత్యదేవ్‌, బిందు మాధవి, హెబ్బా పటేల్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో నటించాడు. అయితే, తెలుగులోనే కాకుండా సౌత్‌లో పెద్ద హీరోల్లో ఒక్కరు కూడా ఇప్పటిదాకా వెబ్‌ సిరీస్‌ల్లో అడుగు పెట్టలేదు.

    అయితే, సౌత్‌ స్టార్ సూర్య ఇప్పుడు ఈ పాత్‌ను బ్రేక్‌ చేయబోతున్నాడు. ఓటీటీ సత్తా ఏమిటో చాన్నాళ్ల క్రితమే గ్రహించిన సూర్య.. థియేటర్ యజమానులతో విభేదించి తాను నిర్మించిన ఓ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేశాడు. ఇప్పుడు నేరుగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు రెడీ అయ్యాడు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది ఎపిసోడ్స్‌ తీసేలా మణిరత్నం వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్‌ చేశాడు. ఆయనతో పాటు గౌతమ్‌ మీనన్, కార్తీక్‌ నరేన్‌, నంబియార్, హీరోలు సిద్ధార్థ్‌, అరవింద్‌ స్వామి మరో ముగ్గురు ఒక్కో ఎడిసోడ్‌కు డైరెక్షన్‌ వహిస్తారు. దీనికి ‘నవరస’ అనే టైటిల్‌ ఖారారు చేశాడు మణిరత్నం. నవరసాల్లోని ఒక్కో ఎమోషన్‌ను ఒక్కో ఎపిసోడ్‌లో చూపించబోతునారు. ఈ వెబ్‌ సిరీస్‌లో సూర్య విలన్‌గా నటించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. దీన్ని వెబ్‌ సిరీస్‌ బృందం ఖరారు చేస్తే మూవీ ఇండస్ట్రీ ఫ్యూచర్ మారే చాన్సుంది. మరెందరో స్టార్లు వెబ్‌ బాట పట్టే అవకాశం లేకపోలేదు.