Surya Daughter: సూర్య కూతురు మార్కులు చూస్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది…మరి అన్ని మార్కులు వచ్చాయేంటి భయ్యా…

ప్రస్తుతం ఇంటర్ చదువుతుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఆమె సత్తా చాటుకుంది. నిజానికి సెలబ్రిటీల పిల్లలు ఎవరు కూడా పెద్దగా చదువు మీద ఆసక్తి చూపించరు.

Written By: Gopi, Updated On : May 10, 2024 12:57 pm

Surya Daughter Diya Got Highest Marks in Intermediate Exams

Follow us on

Surya Daughter: కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని సినిమాలు చేయడంలో సూర్యకి ఉన్న గుర్తింపు మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఎంతో కొంత వైవిధ్యాన్ని సంతరించుకొని ఉంటుంది. అందువల్లే ఈయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే సూర్య జ్యోతిక ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళకి దియా అనే ఒక కూతురు ఉంది.

ఇక ఆమె ప్రస్తుతం ఇంటర్ చదువుతుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఆమె సత్తా చాటుకుంది. నిజానికి సెలబ్రిటీల పిల్లలు ఎవరు కూడా పెద్దగా చదువు మీద ఆసక్తి చూపించరు. అయితే వాళ్ల పేరెంట్స్ కూడా మామూలుగా చదివి పాస్ అయితే సరిపోద్దిలే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ సూర్య జ్యోతికలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్లకు వాళ్ల కూతురు బాగా చదువుకొని టాపర్ గా నిలవాలని అనుకుంటారు.ఇక అందులో భాగంగానే దియా ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో తన సత్తా చాటుకుంది.

600 మార్కులకు గాను ఆమెకు 581 మార్కులు రావడం విశేషం..ఇక తమిళంలో 100 మార్కులకు 96 మార్కులను సాధించింది. ఇంగ్లీషులో 97, అకౌంట్స్ లో 94, ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈమెకి వచ్చిన మార్కులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితే అవుతున్నాయి.

ఇక సూర్య జ్యోతికలకు చదువుల సరస్వతి పుట్టింది అంటూ సూర్య అభిమానులు కొందరు సోషల్ మీడియాలో కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య కంగువ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ కి కూడా రెడీ చేయాలనే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది…