Surya And Balakrishna
Surya And Balakrishna: మూవీ లవర్స్ కలలో కూడా ఊహించని కొన్ని అద్భుతమైన కాంబినేషన్స్ ఇటీవల కాలం లో కార్య రూపం దాల్చడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో నటిస్తున్న ‘జైలర్ 2′(Jailer 2 Movie). 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘జైలర్’ చిత్రం సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో అల్లాడించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం కొల్లగొట్టింది. హిందీ వెర్షన్ సహకారం లేకుండా, కేవలం సౌత్ ఇండియా భాషల్లో విడుదలై ఈ రేంజ్ సెన్సేషన్ సృష్టించడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే మామూలుగా ఉంటుందా మరి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో లీకై బాగా వైరల్ అయ్యాయి.
Also Read: మరగుజ్జుగా కనిపించబోతున్న రామ్ చరణ్..అభిమానులు తట్టుకోగలరా!
అదేమిటంటే ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, ఆయనకు సంబంధించిన షూటింగ్ జూన్ నెలలో జరుగుతుందని అంటున్నారు. కేరళ లో ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్ ని ఏర్పాటు చేసారని, వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం లో కేవలం బాలయ్య మాత్రమే , తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఉంటాడని అంటున్నారు. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో సూర్య(Suriya Sivakumar), బాలయ్య మధ్య ఒక భారీ పోరాట సన్నివేశం కూడా ఉంటుందట. ఈ సన్నివేశం ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయబోతున్నారు. సినిమాలో నటించే నటీనటుల గురించి కూడా ఒక అప్డేట్ ఇవ్వనున్నారు. ఇదంతా పక్కన పెడితే మొదటి భాగం లో కూడా ప్రత్యేకమైన అతిథి పాత్రలు ఉన్న సంగతి తెలిసిందే.
కన్నడ సినీ పరిశ్రమ నుండి శివ రాజ్ కుమార్, మలయాళం సినీ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కనిపించింది చాలా తక్కువ సమయం అయినప్పటికీ, ఎంతో పవర్ ఫుల్ గా వాళ్ళను ఆడియన్స్ కి ప్రెజెంట్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా వీళ్లిద్దరి క్యారెక్టర్స్ ఉంటాయట. ఇంకా ఈ సినిమాలో బోలెడన్ని ట్విస్టులు, సర్ప్రైజ్ లు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరో గా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో నటించిన ‘కూలీ’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని, ఆగష్టు 14 న థియేటర్స్ లోకి రాబోతుందని నిన్ననే అధికారిక ప్రకటన వచ్చింది. అదే విధంగా ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.