https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ నుండి సర్ ప్రైజింగ్ వీడియో… పుష్ప 2 ఫస్ట్ లుక్ తో!

అనంతరం ఇంస్టాగ్రామ్ ప్రతినిధులను పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లాడు. అక్కడ తన కోసం వేచి ఉన్న ఫ్యాన్స్ ని పరిచయం చేశాడు.

Written By:
  • Shiva
  • , Updated On : August 30, 2023 / 10:57 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: అల్లు అర్జున్ కి దక్కుతున్న ఒక్కో గౌరవం ఆయన స్థాయి ఏమిటో తెలియజేస్తుంది. జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఇంస్టాగ్రామ్ ఆయన మీద ప్రత్యేక వీడియో చేసింది. ఇంస్టాగ్రామ్ ప్రతినిధులు అల్లు అర్జున్ ని కలిసి ఆయన లైఫ్ స్టైల్ తో పాటు పుష్ప 2 చిత్ర షూటింగ్ విశేషాలు చిత్రీకరించారు. అల్లు అర్జున్ హౌస్ తో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వీడియో చిత్రీకరించారు.

    ఇంస్టాగ్రామ్ ప్రతినిధులకు అల్లు అర్జున్ తన లైఫ్ స్టైల్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఫ్యాన్స్, పుష్ప 2 మూవీ గురించి వివరించారు. ఇక మార్నింగ్ లేవగానే తన దిన చర్య ఏమిటో చెప్పారు. గార్డెన్ లో గడపడం, యోగా చేయడం, వర్క్ అవుట్స్ అనంతరం ఒక బ్లాక్ కాఫీతో తన డే మొదలవుతుందని ఆయన అన్నారు. ఎక్కడ ఉన్నా పిల్లలతో వీడియో కాల్ మాట్లాడతాను అన్నారు. అర్హ, అయాన్ తన ప్రపంచం అని చెప్పారు.

    అనంతరం ఇంస్టాగ్రామ్ ప్రతినిధులను పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లాడు. అక్కడ తన కోసం వేచి ఉన్న ఫ్యాన్స్ ని పరిచయం చేశాడు. ఇండియాలో అభిమానులు చాలా క్రేజీగా ఉంటారు. మిగతా దేశాల్లో అభిమానులు భిన్నం అని చెప్పారు. అనంతరం పుష్ప 2 సెట్స్, తన కాస్ట్యూమ్స్, మేకప్ గురించి వివరించారు. అల్లు అర్జున్ పై తీసిన కొన్ని షాట్స్ కి సంబంధించిన విజువల్స్ వీడియోలో ఉన్నాయి. అలాగే పుష్ప 2 లుక్ కూడా లీక్ చేశారు.

    ఇండియాలో ఏ హీరోపై ఇంస్టాగ్రామ్ ఇలా స్పెషల్ వీడియో చేయలేదు. మొత్తంగా అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. పుష్ప 2 రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల కానుందని సమాచారం. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందించారు.