Mother’s Day: మదర్స్ డే.. మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లుల రుణాన్ని తీర్చుకునే రోజు. కనీసం వారి కష్టాన్ని గుర్తించే రోజు.. గుర్తింపునిచ్చే రోజు. అమ్మలేకుంటే మనం ఈ స్థాయిలో ఎవ్వరం ఉండలేం. ఆమె నవ మాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తేనే ఈస్థాయికి ఎదిగాం.. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ ఈ రోజు ‘అమ్మ’ను గుర్తు చేసుకుంటున్నారు.

తాజాగా మెగా బ్రదర్స్ ‘మదర్స్ డే’ నాడు అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ను ఇచ్చారు. చిరంజీవి, పవన్ , నాగబాబు కలిసి షూటింగ్ లో ఉండగా వారి తల్లి వచ్చిన సందర్భంగా ఆప్యాయతను పంచుకున్న వీడియో వైరల్ అయ్యింది.
Also Read: Rahul Gandhi-Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే రాహుల్ ప్లాన్లు ఇవీ
చూస్తుంటే ఇది భీమ్లానాయక్, ఆచార్య మూవీ షూటింగ్ టైంలో ఒకే చోట స్టూడియోలో కలుసుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వద్దకు వారి తల్లి వచ్చి ఉంటుందని అనిపిస్తోంది.తల్లి రాగానే చిరు, పవన్ లేచి నిలుచొని ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని తల్లితో కలిసి భోజనం చేసి ఖుషీ చేశారు. ఇలా ముగ్గురు అగ్ర సినీ ప్రముఖులు తమ తల్లితో కలిసి ఆనంద క్షణాలను ఈ మదర్స్ డే సందర్భంగా పంచుకున్నారు.

దీనికి ‘మగువ మగువ’ అని మహిళ పాత్రపై వకీల్ సాబ్ లో వచ్చిన మ్యూజిక్ థీమ్ ను యాడ్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానుల కోరికను తీర్చుతోంది. చిరంజీవి, పవన్, నాగబాబులు ఒకే ఫ్రేంలో కనిపించడంతో దీన్ని మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తూ మదర్స్ డే నాడు ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. మీరూ ఆ వీడియోను కింద చూసి ఎంజాయ్ చేయండి.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022