మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ కు రాంచరణ్ తోపాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే.
చెర్రీ పుట్టిన రోజు కానుకగా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రాంచరణ్ వీడియోను విడుదల చేశాడు. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో విడుదలైన ఈ వీడియో సీనిప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.‘ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లుంటది.. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లుంటది.. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడతది..’ అంటూ యంగ్ టైగర్ బ్యాగ్రౌండ్లో చెప్పిన డైలాగులు మతబుల్లా పేలాయి. రాంచరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకున్నాడు. రాంచరణ్ ను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా చూపించాడు. రాంచరణ్ నటన అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్ కోసం అభిమానులకు ఒకేసారి ఆ లోటు తీర్చినట్టు కన్పిస్తుంది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అఅవుతున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ మూవీని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా నటిస్తుంది. ఎప్పటిలాగే రాజమౌళి సినిమాలకు అద్భుతంగా మ్యూజిక్ అందించే కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’ కు కూడా అదే రేంజ్లో మ్యూజిక్ అందించాడు. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నిర్మిస్తున్నాడు. 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.
As promised, I give you @AlwaysRamCharan!
Happy birthday brother! Will cherish our bond forever.#BheemforRamaraju https://t.co/nCiO2YLgs2— Jr NTR (@tarak9999) March 27, 2020